OTT Movie : రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతారా చాప్టర్ 1’ భారతదేశం అంతటా థియేటర్లలో సత్తా చాటుతోంది. ఇది 2022లో వచ్చిన ప్రీక్వెల్ గా వచ్చింది. ఈ సినిమా బూటా కోలా ఆచారం ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఇంకా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనలో ఉంది. దాదాపు ఇప్పటికే ఐదు వందల కోట్ల మార్క్ ను దాటింది. అయితే ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు . ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ పేరు ఏమిటి ? ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘కాంతారా చాప్టర్ 1’ (Kantara Chapter 1) 2025 అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో భారీ ధరకే కొనుగోలు చేసింది. దాదాపు 125 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. ఇది అత్యధిక పారితోషికం పొందిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. ఇందులో రిషబ్ షెట్టి, గుల్షన్ దేవయ్య, రుక్మిణి వసంత్, జయరామ్, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు. Imdbలో దీనికి 8.6/10 రేటింగ్ కూడా ఉంది.
ఈ కథ 4వ శతాబ్దంలో, కడంబ రాజవంశం కాలంలో జరుగుతుంది. ఈ కాలంలో బంగర రాజ్యం సిరి, సంపదలతో కళకళ లాడుతుంటుంది. కానీ ఈ రాజ్యం పక్కనే కాంతారా అనే అడవి ఉంటుంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు జీవిస్తుంటారు. వీళ్లు పంజుర్లి, గులిగా అనే దైవాలను పూజిస్తుంటారు. బెర్మే (రిషబ్ షెట్టి) కాంతారా గ్రామంలో పెరిగిన ఒక యువకుడు. అతను కొంచెం జులాయిగా తిరుగుతుంటాడు. కానీ అడవిని, గ్రామస్తులతో ప్రేమగా ఉంటాడు. వాళ్ల కోసం ఏదైనా చేస్తాడు. ఇదే సమయంలో బంగర రాజ్యంలో కులసేఖర అనే కొత్త రాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. కులసేఖర చాలా అహంకారి, దురాశగలవాడు. అతనికి కాంతారా అడవిలోని దేవుళ్ళు ఉండే పవిత్రమైన చోటు గురించి తెలుస్తుంది. అక్కడ బంగారం ఉందని అతను భావిస్తాడు. కాబట్టి అతను అడవిని కట్ చేసి, రాజ్యాన్ని మరింత రిచ్ చేయాలని ప్లాన్ చేస్తాడు.
కానీ గ్రామస్తులకు ఆ చోటు పవిత్రమైనదిగా భావించి, వాళ్లు అడవిని కాపాడటానికి రెడీ అవుతారు. కులసేఖర సైనికులను పంపి అడవిని ఆక్రమించాలని ట్రై చేస్తాడు. బెర్మే గ్రామస్తులను ఒకటి చేసి, సైనికులతో ఫైట్ చేస్తాడు. బెర్మే గులిగా దైవంతో కనెక్ట్ అయి, సూపర్ నాచురల్ పవర్‌తో సైనికులను ఓడిస్తాడు. అయితే ఇప్పుడు కనకవతి అనే అమ్మాయి గ్రామంలో కొత్తగా ఎంటర్ అవుతుంది. ఇక కథ పూర్తిగా మారిపోతుంది. కనకవతి ఎవరు ? ఎందుకు ఆ గ్రామానికి వచ్చింది ? బెర్మే తన గ్రామాన్ని, ఆ దైవం ఉన్న చోటుని ఎలా కాపాడుకుంటాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భార్య పోగానే గర్ల్ ఫ్రెండ్ తో హనీమూన్‌కు… మెంటల్ మాస్ ట్విస్టు మావా… క్రేజీ కొరియన్ హర్రర్ మూవీ