BigTV English

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి
Advertisement

K- RAMP: ఏదైనా పండగ వస్తుంది అంటే చాలు చాలా మంది చిత్ర నిర్మాతలు వాళ్ల సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక దీపావళి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో అన్నిటికంటే ముందు రిలీజ్ అయింది మిత్రమండలి. సినిమా గురించి ఒక్కచోట కూడా పాజిటివ్ కామెంట్స్ వినిపించలేదు. సినిమా మొదటి రోజుకే ఎత్తిపోయింది.


తర్వాత విడుదలైన తెలుసు కదా, డ్యూడ్ సినిమాలకు కొంతమేరకు పాజిటివ్ టాక్ లభించింది. కిరణ్ అబ్బవరం నటించిన K -Ramp సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ముందు నుంచే చెప్పిన మాదిరిగానే ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అయితే ఈ సినిమా కూడా విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది ఇదే సినిమాను దీపావళి విన్నర్ గా కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఇంకొంతమందికి తెలుసు కదా సినిమా విపరీతంగా నచ్చింది.

మైనస్ రేటింగ్ ఇచ్చిన పర్లేదు 

ఈ సినిమాని రాజేష్ దండు నిర్మించారు. రాజేష్ దండు రీసెంట్ టైమ్స్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటున్నారు. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా రాజేష్ దండుకి మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది. ఇక కిరణ్ నటించిన K -Ramp సినిమా కలెక్షన్లు కూడా బాగా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.


ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీ ప్రెస్ మీట్ లో నిర్మాత రాజేష్ దండు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి (Baahubali) ని K- ramp ని ఒకేలా చూడండి. ట్విట్టర్ లో Show Time అని ట్వీట్ వేస్తున్నారు 1 hour తర్వాత ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఇస్తున్నారు మళ్ళీ 3 అవర్స్ తర్వాత రిపోర్ట్ ఇస్తున్నారు. K RAMP కి ఎందుకు పార్షియాలిటీ చూపిస్తున్నారు, నేను చాలా బాధపడుతున్నాను, వేరే సినిమాలకి మా సినిమాలకి వచ్చే కలెక్షన్స్ చూడండి, రేటింగ్స్ చూడండి. అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలానే కలెక్షన్స్ పోస్ట్ చేసే కొన్ని ట్విట్టర్ ఐడిలను కూడా మెన్షన్ చేశారు.

ఎంటర్టైన్మెంట్ ప్లస్ 

ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ సినిమా మనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ వంటి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు పది కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

అయితే ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. క వంటి కాన్సెప్ట్ బే సినిమాలు కిరణ్ కం బ్యాక్ కోసం హెల్ప్ అయితే, ఈ సినిమా మళ్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం లాగా కమర్షియల్ సక్సెస్ అందించింది అని చెప్పాలి.

Related News

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Big Stories

×