CM Chandrababu: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ఒక డీఏ ప్రకటిస్తున్నట్టు మీడియా సమావేశంలో తెలిపారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా డీఏ ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
‘రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర. గత ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు పెండింగ్లో పెట్టింది. మొత్తం రూ.7 వేల కోట్లు పెండింగ్ డీఏలు ఇవ్వాల్సి వస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయిన చంద్రబాబు. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నాం. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టడం చారిత్రాత్మక ఘట్టం’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ALSO READ: Tirupati Train Timings: తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది!
‘రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నాం. ఆప్కాస్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు. ఎవరినీ కించపరిచే పరిస్థితి లేదు. ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలం. రూ.51,452 కోట్లను ఎస్టాబ్లిష్ మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాం. అంటే 91శాతం ఖర్చు ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాం’ అని సీఎం తెలిపారు.
ALSO READ: Wine Shops Applications: వైన్స్ టెండర్ల జోరు.. 82 మద్యం షాపులకు 3500 అప్లికేషన్స్
‘పొరుగు రాష్ట్రాలన్నీ గత ఐదేళ్లలో జాగ్రత్తపడ్డాయి. తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 39 శాతానికి ఈ వ్యయాన్ని తగ్గించుకున్నాయి. గత ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్లే ఇబ్బందులు పడే పరిస్థితి. భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అనుత్పాదక వ్యయం కోసం ఖర్చు చేశారు’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.