OTT Movie : గోదావరి జిల్లాల పేర్లు వినబడగానే ఒక రకమైన పులకింత వస్తుంది. ఆ మర్యాదలు, పలకరింపులు అబ్బో ఒకటేమిటి చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక తెలుగు వెబ్ సిరీస్ ను ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. గోదావరి ప్రాంత కుటుంబాల సంస్కృతి గొడవలు, ప్రేమ గురించి ఈ సిరీస్ చక్కగా చూపిస్తుంది. ఈ కథ ఈస్ట్ గోదావరి అబ్బాయికి, వెస్ట్ గోదావరి అమ్మాయికి పెళ్లి జరిగాక స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. కామెడీ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ ను చూస్తే, ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘అనందలహరి’ (Anandalahari) 2025లో వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. సాయి వనపల్లి దర్శకత్వంలో అభిషేక్ బొద్దెపల్లి, బ్రమరాంబిక తూతిక, కృష్ణ యెరుబ్బని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 8 ఎపిసోడ్‌లతో, IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది. 2025 అక్టోబర్ 17 నుంచి Aha ఓటీటీలో విడుదల అయింది.
అనంద్ వెస్ట్ గోదావరి లో సరదాగా సమయం గడుపుతుంటాడు. అతని తండ్రి ఒక సర్పంచ కావడంతో తండ్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుతుంటాడు. మరో వైపు లహరి అనే ఈస్ట్ గోదావరి అమ్మాయి, సిటీలో మంచి జాబ్ కోసం ఎదురుచూస్తుంటుంది. వీళ్లిద్దరూ వేర్వేరు బ్యాక్ గ్రౌండ్‌ల నుంచి వచ్చినా, కథ పూర్తిగా మారిపోతుంది. అనంద్ కి పెళ్లి ప్రయాయత్నాల్లో భాగంగా లహరితో సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. అయితే లహరికి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మొత్తానికి వీళ్ళ పెళ్లి అనేక ట్విస్టులతో జరిగిపోతుంది. ఇక మకాం సిటీకి కూడా మారుస్తారు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది.
Read Also : ఆకాశంలో విహారయాత్ర… పైప్రాణాలు పైకే పోయే ఆపద… తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్
లహరి తన చదువుకు తగ్గట్టు జాబ్ ని సంపాదిస్తుంది. అనంద్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఏ పని పాటా లేకుండా బేవార్స్ గా తిరుగుతుంటాడు. ఇక డబ్బుల కోసం ఇంట్లోనే దొంగతనాలు కూడా చేస్తాడు. స్టోరీ కామెడిగా నడిచినా, ఆ తరువాత సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలు ఎలా ఉంటాయి ? వీళ్ళు వీటిని పరిస్కరించుకుంటారా ? వీళ్ళ కాపురం సజావుగా సాగుతుందా ? అనే విషయాలను, ఈ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.