Dhaka Airport Fire: వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో క్రికెటర్లు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్టేడియంలో కూడా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది . ఈ అంతర్జాతీయ విమానాశ్రయం బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన షేర్ బంగ్లా నేషనల్ స్టేడియానికి దగ్గరగానే ఉంది. దీంతో అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే, స్టేడియం వరకు మంటలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య దాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. విమానాశ్రయంలోని దిగుమతి చేసుకున్న సరుకులు నిల్వచేసే కార్గో టెర్మినల్ లో ఈ మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో దాదాపు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో పొగలు అమ్మేశాయి. ఈ పొగలు బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న స్టేడియం వద్దకు కనిపించాయి. దీంతో క్రికెటర్లు అందరూ ఉలిక్కి పడ్డారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ ( Bangladesh vs West Indies, 1st ODI ) మధ్య జరిగిన ఇవాల్టి మొదటి వన్డే మ్యాచ్ లో లోకల్ ప్లేయర్లు అదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ పై బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. 49.4 ఓవర్స్ ఆడిన బంగ్లాదేశ్, 207 పరుగులు చేసి రఫ్పాడించింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది వెస్టిండీస్. 39 ఓవర్లలోనే 133 పరుగులు చేసిన వెస్టిండీస్ ఆల్ అవుట్ అయింది. ఇది ఇలా ఉండగా వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేల తో పాటు మూడు టి20 మ్యాచ్ లు కూడా జరగాల్సి ఉంది. అక్టోబర్ 23వ తేదీ వరకు వన్డే సిరీస్ ఫినిష్ అవుతుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది.
RARE SCENES! ⛔
Fire smoke from Shahjalal International Airport creeping into the stadium…⚠️#BANvsWI #CricVerse pic.twitter.com/SDNTD0KRTL
— Laraib Fatima🦋 (@Laraib_Fatiima) October 18, 2025