Big tv Kissik Talks: సినీనటి హరితేజ(Hari Teja) ఎన్నో సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల కంటే కూడా వెండితెర సినిమాల పైన ఫోకస్ పెట్టిన హరితేజ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా హరితేజ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరితేజ బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హరితేజ బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి సందడి చేశారు.
తాజాగా హరితేజ బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. తనకు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని లేకపోయినా తన భర్త బలవంతం మీద వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. నేను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తే ఆయన కూడా ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి రావాలని కోరుకున్నారు. నువ్వు ఫ్యామిలీ వీక్ వరకు హౌస్ లో ఉండాల్సిందే నేను బిగ్ బాస్ హౌస్ లో కనపడాల్సిందే అంటూ చెప్పి హౌస్ లోకి పంపించారు. అనుకున్న విధంగానే ఆయన ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగు పెట్టారని హరితేజ తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమం చాలా సరదాగా ఉండేదని హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా బాగా ఎంజాయ్ చేశామని తెలిపారు.
ఇప్పుడంటే బిగ్ బాస్ కార్యక్రమమున హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలోనే ఉందని , కానీ మొదటి సీజన్ లోనావాలాలో ఏర్పాటు చేశారని ఈమె గుర్తు చేసుకున్నారు. చుట్టూ ఫారెస్ట్ ఉండేదని, రాత్రి అయితే చాలు హౌస్ లోకి పాములు వచ్చేవి అలాగే చుట్టూ ఫారెస్ట్ కావడంతో పులులు అరుపులు కూడా వినిపించేవని ఈ సందర్భంగా హరితేజ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇక బిగ్ బాస్ 8 కార్యక్రమంలోకి వెళ్లిన ఈమె ఇకపై బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమానికి పిలిస్తే మీరు వెళ్తారా అంటూ ప్రశ్నించడంతో తాను నాలుగు వైపులా తిరిగి దండం పెట్టుకొని ఈ కార్యక్రమానికి వెళ్ళనని చెబుతానని హరితేజ వెల్లడించారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని ప్రశ్నించడంతో తాను అసలు బిగ్ బాస్ కార్యక్రమమే చూడటం లేదంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. రెండుసార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లిన హరితేజ ఇకపై బిగ్ బాస్ కార్యక్రమానికే తాను వెళ్ళనని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక బిగ్ బాస్ తర్వాత హరితేజ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు కేవలం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Big tv Kissik Talks: ఎన్టీఆర్ తో హరితేజ గొడవ… డైరెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన తారక్?