BigTV English

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా
Advertisement

OTT Movie : అక్షయ్ కుమార్ లాయర్ పాత్రలో నటించిన ‘Jolly LLB 3’ థియేటర్లలో విజయవంతమైంది. త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అభిమానులు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది 2013, 2017లో వచ్చిన Jolly LLB సిరీస్‌కు మూడవ భాగం. దాదాపు ఎనిమిది ఏళ్ల తరువాత మూడవ భాగం థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా నవంబర్ లో రెండు ఓటీటీలలో ప్రీమియర్ కానుంది. ఈ కథ రైతులు తమ భూమి కోసం, న్యాయస్థానంలో చేసే ఒక పోరాటంతో నడుస్తుంది. ఈ లీగల్ డ్రామా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇది ఏ ఓటీటీలో రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో అంటే

‘Jolly LLB 3’ 2025లో వచ్చిన హిందీ లీగల్ సినిమా. సుభాష్ కపూర్. దర్శకత్వంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, సౌరభ్ శుక్ల, సీమా బిస్వాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా నవంబర్ 14 లోగా నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ లో వచ్చే అవకాశం ఉంది. అయితే అఫీసియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.

కథలోకి వెళ్తే

రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామంలో జంకీ అనే మహిళ ఉంటుంది. ఆమె ఒక రైతును వివాహం చేసుకుంటుంది. అయితే ఆమె భర్త ఒక రోజు ఆత్మ హత్య చేసుకుంటాడు. ఎందుకంటే హరిభాయ్ ఖైతాన్ అనే ఒక పెద్ద వ్యాపారవేత్త వీళ్ళ భూమిని తీసుకోవడానికి ఒత్తిడి చేయడంతో అతను చనిపోయాడు. భర్త పోయిన బాధలో ఉన్న జంకీ, తన భూమిని కాపాడుకోవడానికి కోర్టులో కేసు వేస్తుంది. ఈ కేసును వాదించడానికి మిస్రా (అక్షయ్ కుమార్), త్యాగి (అర్షద్ వార్సీ) అనే ఇద్దరు చిన్న లాయర్లు వస్తారు.


Read Also : క్యాబ్ డ్రైవర్ తో రిచ్ పాప యవ్వారం… అర్దరాత్రి అడ్డంగా బుక్కయ్యే జంట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ భయ్యా

మిస్రా, త్యాగి ఇద్దరూ జంకీ కేసు కోసం కోర్టులో పోరాడతారు. మిస్రా తెలివైన ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు. అయితే హరిభాయ్ ఖైతాన్ పెద్ద లాయర్లను, డబ్బును ఉపయోగించి కేసు గెలవడానికి ప్రయత్నిస్తాడు. కానీ జంకీ కేసు రైతుల హక్కులు, భూమి సమస్యల గురించి ఎమోషనల్ గా సాగుతుంది. ఈ ఇద్దరు కలిసి జంకీకి న్యాయం చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. కోర్ట్ లో వాదనలు చాలా టఫ్ గా జరుగుతాయి. చివరికి హరిభాయ్ ను వీళ్ళు కోర్టులో ఓడిస్తారా ? జంకీ తన భూమిని కాపాడుకుంటుందా ? రైతులకు న్యాయం జరుగుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ధృవ్ విక్రమ్ ‘బైసన్’కు ఓటీటీ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : దీపావళికి ఓటీటీలో టపాసుల్లాంటి మూవీస్… వీకెండ్లో ఈ సినిమాలు, సిరీస్ లు డోంట్ మిస్

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×