Big Stories

OnePlus Watch 2: వన్‌ప్లస్ వాచ్ 2 లాంచ్.. ధర, ఫీచర్లు మరియు ఆఫర్లు!

- Advertisement -

MWC 2024: OnePlus Watch 2 Launch: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ మార్కెట్‌లోకి కొత్తగా స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. దీనిని వన్‌ప్లస్ 2 పేరుతో భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది కంపెనీ నుంచి సెకండ్-జన్ హై-ఎండ్ స్మార్ట్‌వాచ్‌గా కంపెనీ పేర్కొంది. ఇది సరికొత్త WearOS సాఫ్ట్‌వేర్, భారీ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో పాటు అనేక స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది.

- Advertisement -

ఈ వాచ్ 2 2.5D సప్‌హైర్ క్రిస్టల్ కవర్‌ను కలిగి ఉంది. ఇది మరింత స్క్రాచ్-రెసిస్టెంట్‌గా చేస్తుంది. అలాగే ఇది సర్టిఫైడ్ చేసిన తాజా MIL-STD-810H US మిలటరీ ప్రమాణానికి కూడా ధృవీకరించబడింది. ఈ పరికరం IP68 రెసిస్టెంట్ రేటింగ్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

కాబట్టి ఈత కొట్టేటప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా Wear OS 3తో ఆధారితమైన ఈ వాచ్ మ్యాప్స్, అసిస్టెంట్, క్యాలెండర్ వంటి పాపులర్ గూగుల్ యాప్‌లతో పాటు మరిన్ని థర్డ్ పార్టీ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది.

READ MORE: ఏంటి బాసూ ఈ డిస్కౌంట్.. రూ.19 వేల స్మార్ట్‌ఫోన్‌‌ ఇంత తక్కువా?

ఈ వాచ్‌కి GPS మద్దతు ఉంటుంది. OHealth యాప్ ద్వారా అందుబాటులో ఉన్న ఫిట్‌నెస్ ఫీచర్‌లలో బ్యాడ్మింటన్, రన్నింగ్, టెన్నిస్, స్కీయింగ్‌తో పాటు దాదాపు 100 కంటే ఎక్కువ క్రీడల కోసం ట్రాకింగ్ మోడ్‌లు ఈ వాచ్‌లో ఉన్నాయి. రన్నింగ్ ట్రాకింగ్ మోడ్‌ని ఉపయోగించి, ధరించినవారు గ్రౌండ్ కాంటాక్ట్ టైమ్, గ్రౌండ్ బ్యాలెన్స్, VO2 మాక్స్ వంటి డేటాను కూడా ట్రాక్ చేయవచ్చు.

అంతేకాకుండా వినియోగదారుల ఘాడ నిద్ర, తేలికపాటి నిద్ర, REM, మేల్కొనే సమయాలను ట్రాక్ చేసే రోజంతా నిద్ర రికార్డుతో సహా వివరణాత్మక నిద్ర ట్రాకింగ్ విశ్లేషణను కూడా అందిస్తుంది. దీంతోపాటు నిద్ర శ్వాస రేటును పర్యవేక్షించడం, నిద్ర నాణ్యత స్కోర్‌ను కూడా అందిస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్ ఒకే వేరియంట్‌లో రిలీజైంది. దీని ధరను దాదాపు రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే లాంచ్‌లో భాగంగా వినియోగదారులు ఈ వాచ్‌ని కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్‌తో ఈ వాచ్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.2000 వరకు తక్షణ తగ్గింపు అందుకోవచ్చు.

READ MORE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.79,999గా గల ఫోన్ కేవలం రూ.42,499కే

ఈ వాచ్‌ను వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ లేదా వన్ ప్లస్ స్టోర్ యాప్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. మొదటి ముగ్గురు కస్టమర్లకు వన్ ప్లస్ కీబోర్డ్ 81 ప్రోని ఫ్రీగా పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా షోల్డర్ బ్యాగ్‌ని కూడా ఫ్రీగా లభిస్తుందని కంపెనీ తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News