E-Paper
Advertisement

Online Payments : ఆన్లైన్ పేమెంట్స్.. ఆపేదెవ్వరు! ఒక్క ఏడాదిలో ఎంత మార్పు

Online Payments : ఆన్లైన్ పేమెంట్స్.. ఆపేదెవ్వరు! ఒక్క ఏడాదిలో ఎంత మార్పు
Advertisement

Online Payments : టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతూ 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ సేవలు ఎంతగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ విషయం ఆన్లైన్ పైనే ఆధారపడి నడుస్తుంది. ముఖ్యంగా డబ్బుల చెల్లింపులకు ఆన్లైన్ పెద్ద వేదికగా మారిపోయింది. ముఖ్యంగా యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులు ఎక్కువవుతున్నాయి. ఇక ఇప్పటివరకు పట్టణాలు, నగరాల్లో మాత్రమే యూపీఐ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి అనుకుంటే పొరపాటు పడినట్టే. తాజాగా పెనియర్ బే నివేదిక గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పుకు వచ్చింది.

డిజిటల్ చెల్లింపులు గ్రామీణ ప్రాంతాల్లో రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ లావాదేవీలు ఏడాది కాలంలో 33% పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది. దీంతో డిజిటల్ బ్యాంకింగ్, నెట్వర్క్ సేవల్లో గ్రామీణ ప్రాంతాల్లో దూసుకుపోతున్నాయని తెలుస్తుంది. ఇక గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఆర్థిక, డిజిటల్ లావాదేవీలు ను సర్వే చేసి తన నివేదికను ఇచ్చింది. ముఖ్యంగా కిరాణా, మొబైల్ రీఛార్జ్ వంటి చిన్న రిటైలర్ల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక తన రిపోర్ట్ ను ఇచ్చింది.

Advertisement

ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జరిగిన లావాదేవీలను గత ఏడాదితో పోలిస్తే కొనుగోలు, ప్రీమియం వసూలు లావాదేవీల చెల్లింపులు 127% పెరిగినట్టు తెలుస్తుంది. కొత్త కస్టమర్స్ సైతం 96% లావాదేవీలు జరిపారని, దేశమంతా డిజిటల్, రిటైల్ దుకాణాలు ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

ఇక చిన్న చిన్న దుకాణాల్లో సైతం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్, పాకెట్ సౌండ్‌బాక్స్, మ్యూజిక్ సౌండ్‌బాక్స్, కార్డ్ సౌండ్‌బాక్స్‌తో సహా వినూత్నంగా ఆన్లైన్ పేటియం చెల్లింపులు ప్రతీ చోటా జరుగుతున్నాయి. Paytm యాప్‌లో బిల్లు చెల్లింపులు, రీఛార్జ్, వాలెట్ చెల్లింపులు, డబ్బు బదిలీలు వంటివి సైతం వేగంగా పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ టాప్ అప్‌లు, స్టోర్‌లో చెల్లింపులు సైతం గణణీయంగా పెరుగుతున్నాయి.

Advertisement

ఇక ఆన్లైన్ ద్వారా జరిగే చెల్లింపుల్లో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో వ్యాపారాలు, బంగారం కొనుగోలు, వ్యక్తిగత రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్ రుణాల్లో ఆన్లైన్ చెల్లింపులు 297% పెరిగినట్టు తెలుస్తోంది. ఆన్లైన్ పేమెంట్స్ పట్ల రోజు రోజుకి అవగాహన పెరుగుతుండటంతో ఇలా లావాదేవీల సంఖ్య పెరుగుతుందని సమాచారం. ఇక మైక్రో ఎటిఎం, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రోజు రోజుకి తగ్గుతున్నాయని, ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్స్ పెరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇక ఏటీఎం ద్వారా నగదు సంహరణ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత గణనీయంగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. గత ఏడాది సగటున నగదు ఉపసంహరణ రూ. 2624గా ఉంటే.. ఈ ఏడాది రూ. 2482గా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో సైతం ఆన్లైన్ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. ఇక వినియోగదారులకు డీల్స్, గిఫ్ట్ వోచర్స్ అందించటంతో ఈ ఆన్లైన్ పేమెంట్ ఫ్లాట్ఫామ్స్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

ALSO READ : అన్లిమిటెడ్ 5G డేటా గిఫ్ట్ ఇస్తారా! వన్ ఇయర్ వ్యాలిడిటీతో!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×