BigTV English

Oppo A3X 5G Launch Date: ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. సామాన్యుల కోసమే వచ్చేస్తుంది..!

Oppo A3X 5G Launch Date: ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. సామాన్యుల కోసమే వచ్చేస్తుంది..!

Oppo A3X 5G Launching in july: స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ ఒప్పో భారత మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా తన హవా చూపిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు మరొక బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై చివరి నాటికి బడ్జెట్ సెగ్మెంట్‌లో  భారతదేశంలో ఒక ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 5,100mAh బ్యాటరీ, 128GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.


కాగా జూలై 2న Oppo A3 (2024), గత వారం Oppo Reno 12 సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ఈ నెలలో వస్తున్న మూడవ స్మార్ట్‌ఫోన్ ఇది. అయితే ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన రెండు ఫోన్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే Oppo A3X 5G స్మార్ట్‌ఫోన్ అంచనా వేసిన స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Oppo A3X 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో మార్కెట్‌లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 1,000 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో LCD డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 6300 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది iQOO Z9 Lite, Vivo T3 Lite, Lava Blaze X వంటి ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీనిస్తుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Also Read:  రియల్‌మి నుంచి మరో సిరీస్ రెడీ.. లాంచ్ ఎప్పుడంటే..?


అందులో 4GB+64GB, 4GB+128GB, 6GB+128GB వేరియంట్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14లో రన్ అయ్యే అవకాశం ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,100mAh బ్యాటరీని ప్యాక్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను పొందుతుందని తెలుస్తోంది. ఇక ఆప్టిక్స్ పరంగా.. ఫోన్ వెనుక ఒకే కెమెరా, LED ఫ్లాష్‌తో రావచ్చని తెలుస్తోంది. అందులో 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్లికర్ సెన్సార్‌తో హెడ్‌లైన్‌గా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

Oppo A3X మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు. అవి Sparkle Black, Starry Purple, Starlight White ఆప్షన్లలో రావచ్చు. ఇక భారతదేశంలో Oppo A3X 5G అంచనా ధర విషయానికొస్తే.. భారతదేశంలో Oppo A3X 5G రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండవచ్చని అంచనా వేయబడింది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×