BigTV English

Realme 13 Pro 5G Series: రియల్‌మి నుంచి మరో సిరీస్ రెడీ.. లాంచ్ ఎప్పుడంటే..?

Realme 13 Pro 5G Series: రియల్‌మి నుంచి మరో సిరీస్ రెడీ.. లాంచ్ ఎప్పుడంటే..?

Realme 13 Pro 5G Series Launch Date: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి భారతదేశంలో తన హవా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా మోడళ్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసిన రియల్‌మి త్వరలో మరొక అద్భుతమైన ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ త్వరలో దేశంలో Realme 13 Pro 5G సిరీస్‌ను విడుదల చేయనుంది.


ఈ సిరీస్‌లో Realme 13 Pro 5G, Realme 13 Pro+ 5G వంటి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. Realme 13 Pro 5G చైనాకి చెందిన సర్టిఫికేషన్ సైట్ TENAAలో తాజాగా దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ, స్టోరేజ్‌ వెళ్లడైంది. అయితే ఒక్క టీనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లోనే కాకుండా ఇది ఇంతకుముందు ఇండోనేషియా సర్టిఫికేషన్ సైట్‌లో కూడా కనిపించింది. అయితే తాజాగా TENAAలో కనిపించిన దాని ప్రకారం.. ఇది మోడల్ నంబర్ RMX3989ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల (1,080 x 2,412 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు సూచించింది.

దీని పరిమాణం 161.3 x 73.9 x 8.2 మిమీ, సుమారు 188 గ్రాముల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గరిష్టంగా 16 GB RAM + గరిష్టంగా 1 TB స్టోరేజ్‌ను కలిగి ఉందని టీనా సూచించింది. అలాగే ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుందని చెప్పబడింది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కాగా ఇది 5,050 mAh బ్యాటరీని కలిగి ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది.


Also Read: పిక్స్ పిశాచి.. జీస్ సపోర్టెడ్ కెమెరాలతో వివో కొత్త ఫోన్లు.. ఇక ఫొటోలు ఫుల్ క్లారిటీ..!

దీని ప్రకారం.. ఇందులో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌ని అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది Realme మొట్టమొదటి ప్రొఫెషనల్ AI కెమెరా ఫోన్ అని చెప్పబడింది. Realme 13 Pro 5G జూలై 30న విడుదల కానున్నట్లు సమాచారం. అయితే దీని స్పెసిఫికేషన్‌ల గురించిన సమాచారం ఈ లిస్టింగ్‌లో పొందుపరచలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ ఉంటుందని సూచించింది. కాగా ఇది ఎఫ్‌సిసి వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. అయితే ఈ వెబ్‌సైట్‌లో 13 ప్రో మోడల్‌తో పాటు మరో మోడల్ కూడా దర్శనమిచ్చింది.

ఇందులో మోడల్ నంబర్ RMX 3921తో మరో స్మార్ట్‌ఫోన్ కనిపించింది. ఇది Realme 13 Pro+ 5G కావచ్చని అంచనా వేస్తున్నారు. మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బోస్టన్ (MFA) సహకారంతో రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు వేరియంట్‌లను కలిగి ఉంటుంది. అవి 8 GB + 128 GB, 8 GB + 256 GB, 12 GB + 256 GB, 12 GB + 512 GB వేరియంట్లు. అయితే త్వరలో Realme వాచ్ S2 కూడా ప్రారంభించబడుతుంది.

Tags

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×