Oppo F27 Pro 5G: Oppo త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. Oppo F27 Proను భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఓ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన వివరాలను లీక్ చేశాడు. ఆ వివరాల ప్రకారం ఇది IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వచ్చే భారతదేశపు మొదటి ఫోన్. ఒప్పో కొత్త సిరీస్ ఫోన్‌లు జూన్ 13న లాంచ్ అయే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కంపెనీ మూడు ఫోన్‌లను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో Oppo F27, F27 Pro, F27 Pro+ ఉన్నాయి. లీక్ ప్రకారం F27 ప్రోకి IP69 రేటింగ్ ఉంటుంది. ఈ ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయిన Oppo A3 ప్రోకి రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
IP69 రేటింగ్ ఇది వాటర్, డస్ట్ నుంచి మొబైల్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది. మార్కెట్‌లో ఉన్న Samsung Galaxy S24, iPhone 15లో కూడా ఈ రేటింగ్ అందుబాటులో లేదు. ఈ రెండు ఫోన్లు IP68 రేటింగ్‌ను అందిస్తున్నాయి. కంపెనీ F27 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందించబోతోంది. డిస్‌ప్లే సైజ్, రిఫ్రెష్ రేట్ గురించి ఎటువంటి సమచారం అందుబాటులో లేదు. టిప్‌స్టర్ షేర్ చేసిన X పోస్ట్ ప్రకారం ఫోన్ కాస్మోస్ రింగ్ డిజైన్‌తో లెదర్ బ్యాక్‌ను కలిగి ఉంది.
Also Read: పిచ్చెక్కించే ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదిరిపోయింది!
వెనుక ప్యానెల్‌పై ఇచ్చిన బ్లూ కలర్ స్ట్రిప్ స్మార్ట్‌ఫోన్‌కు మంచి లుక్ ఇస్తాయి. ఇక్కడ ఉన్న కెమెరా మాడ్యూల్‌లో మీరు బ్లూ మెటల్ రింగ్‌ని కూడా చూస్తారు. ఇది Oppo స్మార్ట్‌ఫోన్‌ను చాలా స్పెషల్‌గా చూపిస్తుంది. ఫోన్ ఫీచర్ల కోసం మరికొంత కాలం ఆగాల్సిందే.
ప్రస్తుతానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల అయిన Oppo F25 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే కంపెనీ ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే ఉంటుంది. ఈ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 1110 నిట్‌లు. ఫోన్ 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో డైమెన్షన్ 7050 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది.
Also Read: ఇది కదా అరాచకం అంటే.. వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. లాంచ్ అయితే ఇక అంతే..!
ఫోటోగ్రఫీ కోసం మీరు ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను చూస్తారు. వీటిలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్‌తో 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చారు. పవర్ కోసం ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.