BigTV English

Oppo Reno 12F: పిచ్చెక్కించే ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదిరిపోయింది!

Oppo Reno 12F: పిచ్చెక్కించే ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదిరిపోయింది!

Oppo Reno 12F: Oppo కంపెనీ ఇటీవల చైనాలో రెనో 12, రెనో 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవి జూన్ లేదా జూలైలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ వేరియంట్ మోడల్ నంబర్ CPH2625 కాగా, ప్రో వేరియంట్ మోడల్ నంబర్ CPH2629 అని నివేదికలు వెల్లడించాయి. ఈ రెండు ఫోన్‌లను లాంచ్ చేయడానికి ముందు కంపెనీ ఒప్పో రెనో 12 సిరీస్‌లో Reno 12F‌ను తీసుకురానుంది.


Oppo Reno 12F స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది. ఫోన్ మోడల్ నంబర్ CPH2637. ఇది TDRA (UAE) సర్టిఫికేషన్‌తో పాటు SIRIM (మలేషియా) సర్టిఫికేషన్‌లో కూడా కనిపించింది. దీనికి ముందు ఈ ఫోన్ యూరప్ EEC కన్ఫర్మెషన్ కూడా పొందింది. త్వరలో భారత్‌లో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ బిఐఎస్ సర్టిఫికేషన్‌లో కూడా కనిపించింది. అయితే భారతదేశంలో ఫోన్ ఏ ఫీచర్లతో వస్తుందో చెప్పలేము.

Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ స్టార్ట్.. మిస్ అయితే చాలా కష్టం..!


Oppo భారతదేశంలో Oppo F25 ప్రోని మార్చి నెలలో విడుదల చేసింది. రెనో 11ఎఫ్ పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి Reno 12F మంచి ఫీచర్లతో భారత్‌లోకి తీసుకురావచ్చు. ఇది Oppo F27 ప్రో ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్ భారతదేశం BIS,  ప్రపంచంలోని దాదాపు ఇతర ప్రధాన మార్కెట్ల నుండి కన్ఫర్మేషన్ సర్టిఫికెషన్ పొందింది. కాబట్టి ఇది త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. జూలైలో కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చు.

Also Read: దుమ్ములేపే ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్లపై రూ.14 వేల డిస్కౌంట్.. అసలు ఊహించలేదు!

Oppo Reno 12F 5G 6.7 అంగుళాల AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లేతో రావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై కలర్‌ఓఎస్ 14లో రన్ అవుతుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7050 SoCతో వస్తుంది.5,000mAh బ్యాటరీ, 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫోన్‌లో ఉంది. ఫోన్ బ్యాక్  64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉంటాయి. దీని ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ఇది డస్ట్, వాటర్ నుండి ప్రొటెక్షన్  కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది.

Tags

Related News

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Big Stories

×