BigTV English

Nagpur Temperature: నాగ్‌పుర్‌ ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ క్లారిటీ

Nagpur Temperature: నాగ్‌పుర్‌ ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ క్లారిటీ

Nagpur Temperature: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ లో శుక్రవారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు రీసెర్చ్ చేసి అది నిజం కాదని తేల్చి చెప్పారు.


ఉష్ణోగ్రత నమోదు కావడంతో సెన్సార్ సరిగా పనిచేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే నాగ్ పూర్ లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ లను ఏర్పాటు చేసింది. అయితే అందులోని రెండు అసాధారణ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. సోనేగానంలోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్ లో ఉష్ణోగ్రత 56 డిగ్రీలు నమోదవగా ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు


మిగతా రెండు స్టేషన్లలో మాత్రం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సైట్ పరిస్థితులు, సెన్సార్ కవచాలు వంటివి దెబ్బతినడంతో పాటు వివిధ కారణాల వల్ల ఆటోమేటిక్ సిస్టమ్ తప్పు రీడింగ్ చూపించవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నాగ్ పుర్ లో నమోదైందన్న వార్త దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×