E-Paper
Advertisement

Gangs of Godavari First Day Collections: మాస్ యాక్షన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ డే కలెక్షన్లు.. విశ్వక్ ఏదో తొక్కాడు భయ్యా..

Gangs of Godavari First Day Collections: మాస్ యాక్షన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ డే కలెక్షన్లు.. విశ్వక్ ఏదో తొక్కాడు భయ్యా..
Advertisement

Gangs of Godavari Collections: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మే 31న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి ఈ మూవీ తొలి రోజు ఎంతమేర వసూళ్లు రాబట్టిందో అనే విషయానికొస్తే..

ఈ ఏడాది విశ్వక్ సేన్‌కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘గామి’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దాదాపు 6ఏళ్ల క్రితం పట్టాలెక్కిన గామి ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ రెస్పాన్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో విశ్వక్ సేన్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో తన తదుపరి సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

అయితే అదే క్రమంలో విశ్వక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా షూటింగ్ బిజీగా ఉన్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ఫస్ట్ నుంచి మంచి హైప్ ఉంది. అప్పటికే విడుదల అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఓ రకమైన బజ్ క్రియేట్ చేయగా.. మూవీ రిలీజ్‌కు ముందు వచ్చిన ట్రైలర్ మరింత స్థాయి అంచనాలను పెంచేసింది. దీంతో ఈ మూవీకోసం చాలా మంది వెయిట్ చేశారు. అలా ఈ సినిమా మే 31న రిలీజ్ అయి అదిరిపోయే టాక్‌ను అందుకుంది.

Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ రివ్యూ.. లంకల రత్నం అదరగొట్టేశాడంటగా..!

Advertisement

అంతేకాకుండా కలెక్షన్లలో కూడా తన హవా చూపిస్తోంది. కేవలం ఫస్ట్ డే ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లను నమోదు చేసింది. వరల్డ్ వైడ్‌గా మే 31న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. దీంతో ఇది విశ్వక్‌కి మంచి నెంబర్ అనే చెప్పాలి. ఫస్ట్ డేనే ఈ మూవీ ఇంత కలెక్ట్ చేసిందంటే ఈ వారంలో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వీకెండ్‌లో రిలీజ్ కావడంతో ఈ రెండు మూడురోజులు మరింత ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

ఈ మూవీలో విశ్వక్ సేన్ ‘లంకల రత్నం’ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. మరీ ముఖ్యంగా అతడి మాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అలాగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ నేహా శెట్టి అందాలు. ఆమె తన అందాలతో సినీ ప్రియుల్ని కట్టి పడేసింది. అలాగే రత్నమాల పాత్రలో అంజలి కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. మొత్తంగా అందరి సహకారంతో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుని దూసుకుపోతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×