BigTV English
Advertisement

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Oppo K Series: ఒప్పో.. అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ సంపాదించుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల్లో ఇది ఒకటి. వచ్చిన అతి కొద్ది నెలల్లోనే దేశ వ్యాప్తంగా సత్తా చాటింది. తన బ్రాండ్‌ను అందరికీ గుర్తుండిపోయేలా అధునాతన ఫీచర్లతో కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. అంతేకాకుండా అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించడంతో ఆదరణ మరింత పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలని అనే ఆలోచన రాగానే ముందుగా ఒప్పో పేరు గుర్తుకొస్తుంది. అంతలా ఫోన్ ప్రియుల మెదల్లలో నిలిచిపోయింది.


అలుపెరగకుండా తరచూ ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రపంచ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్‌లో హవా చూపిస్తోంది. ఇప్పటికే చాలా మోడళ్లను తీసుకొచ్చింది. ఇక త్వరలో మరో మోడల్‌ను పరిచయం చేసేందుకు తన తదుపరి సిరీస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. Oppo చైనా మార్కెట్‌లో లాంచ్ చేయగల కొత్త K సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ PKS110 మోడల్ నంబర్‌ను కలిగి ఉన్నట్లు ఇటీవల ఓ టిప్‌స్టర్ వెల్లడించారు. ఇప్పుడు ఈ టిప్‌స్టర్ ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన కొన్ని విషయాల్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మరి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Oppo K సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు లీక్ అయ్యాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి కంపెనీ త్వరలో మోడల్ నంబర్ Oppo PKS110 ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చని వెల్లడించారు. ఇందులో సింగిల్ సెల్ 6500mAh సామర్థ్యం బ్యాటరీ ఉంటుందని తెలిపారు. ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చారు.


Also Read: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

అంతేకాకుండా ఈ టిప్‌స్టర్ ఫోన్ ప్రాసెసర్ గురించి కూడా వెల్లడించారు. దాని విషయానికొస్తే ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చినట్లు చెప్పుకొచ్చారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ డిజైన్‌లో స్లిమ్‌గానూ, బరువు తక్కువగానూ ఉంటుంది. ఇందులో హై స్ట్రెంగ్త్ పాలిమర్ కాంపోజిట్ ఫ్రేమ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని తెలిపారు.

స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్ బట్టి ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైనది కావచ్చని తెలిపారు. అంతేకాకుండా దీనిని మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో అందించవచ్చని చెప్పుకొచ్చారు. కాగా కంపెనీ ఇంతకుముందు K సిరీస్‌లో Oppo K12, K12xలను విడుదల చేసింది. ఇక్కడ కంపెనీ ఈ సిరీస్‌లో కొత్త ఎడిషన్‌ను తీసుకొస్తుందా? లేక మరేదైనా కొత్త మోడల్‌ను పరిచయం చేస్తుందా? అనేది తెలియరాలేదు. అంతేకాకుండా ఈ కొత్త ఫోన్ Oppo K13 సిరీస్‌ను కూడా లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. త్వరలో ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×