BigTV English

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Motorola Best Smartphone Under rs 10000: దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తోంది. అదే సమయంలో పలు బ్రాండెడ్ కంపెనీలు సైతం కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ సత్తా చాటుతున్నాయి. అయితే వాటి ధరలు అధికంగా ఉండటంతో ఫోన్ ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్న మొబైల్ ఫోన్లన్నీ దాదాపు రూ.15 వేలకి పైగా ధరతో వస్తున్నాయి. దీంతో సామాన్యులకు ఇంతటి ధర భారంగా మారుతుంది.


ఇంత పెద్ద మొత్తంలో ఫోన్ కొనుక్కోవాలంటే కాస్త ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా ఆఫర్లు లేదా మరే కంపెనీ అయినా తక్కువ ధరలో ఫోన్లను ప్రకటిస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఊహించని ధరకు కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ప్రముఖ టెక్ బ్రాండ్ మోటోరోలా ఫోన్లపై ఆసక్తి ఉన్న దాదాపు రూ.10వేలలోనే ఫోన్‌‌ను సొంతం చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Moto G45 5G


Moto G45 5G స్మార్ట్‌ఫోన్ 6.45 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను పొందుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వచ్చింది. ఇది Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో 4జీబీ/128 జీబీ ధర రూ.10,999గా ఉంది.

అదే సమయంలో 8జీబీ/ 128జీబీ ధర రూ.12,999గా ఉంది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఈ డిస్కౌంట్లతో బేస్ వేరియంట్‌ను రూ.10 వేలలోపే కొనుక్కోవచ్చు. Moto G45 5G 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. అలాగే ఇది Motorola UX స్కిన్‌ను కలిగి ఉంటుంది. Motorola ఈ మొబైల్‌పై 1 సంవత్సరం OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

Also Read: వివో నుంచి మెస్మరైజింగ్ ఫోన్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో భారీ బ్యాటరీ, డోంట్ మిస్ గురూ!

Motorola G34 5G

Motorola G34 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ. 10,000 కంటే తక్కువ ధరకు లభించే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్. ఈ Moto ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4జీబీ/128జీబీ వేరియంట్ రూ.10,999 ధరను కలిగి ఉంది. అదే సమయంలో 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.11,999 ధరతో వచ్చింది. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతో బేస్ వేరియంట్‌ను రూ.10వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ 6.5 ఇంచుల HD+ Displayతో వచ్చింది. Snapdragon 695 5G Processorను కలిగి ఉంది. ఈ ఫోన్ Vegan Leather Designతో వచ్చింది. బ్యాక్ సైడ్ 50MP + 2MP కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్ ముందు వైపు 16MP కెమెరాతో వచ్చింది.

Motorola G04 4g

Moto G04 స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల IPS పంచ్‌హోల్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో Unisoc T606 చిప్‌సెట్ ఉంది. ఫోన్ 8GB RAM వేరియంట్‌ను కలిగి ఉండగా 16GB వరకు విస్తరించవచ్చు. అలాగే 128GB స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మైక్రో SD కార్డ్ సహాయంతో 1TB వరకు పెంచవచ్చు. దీనిని చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు.

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×