Oppo Reno 13 : చైనా కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo).. తాజాగా రెనో 13 సిరీస్ (Oppo Reno 13 Series) ను లాంఛ్ చేసింది. ఇందులో రెనో 13 (Oppo Reno 13 ), రెనో 13 ప్రో (Oppo Reno 13 Pro) మెుబైల్స్ ఉన్నాయి. ఈ సరికొత్త మెుబైల్స్ ఫీచర్స్ ప్రస్తుతం టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు ఫోన్స్ సరికొత్త డైమన్ సిటీ 8350 చిప్‌సెట్‌తో వచ్చేశాయి. ఇక ఇందులో లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు సరికొత్త ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు, ట్రిపుల్ IP రేటింగ్ ఉన్నాయి. ఇక ఈ లేటెస్ట్ మొబైల్స్ సరికొత్త ఫీచర్స్ పై మీరు ఓ లుక్కేయండి.
Oppo Reno 13 సిరీస్ తాజాగా చైనాలో లాంఛ్ అయింది. ఈ రెండు మొబైల్స్ ఒకదానికి ఒకటి పోటీ పడుతూ సరికొత్త ఫీచర్స్ తో వచ్చేసాయి. ఇక వీటి ప్రాసెసర్, కెమెరా ఫీచర్స్, ఛార్జింగ్, బ్యాటరీ, డిస్ ప్లే ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి.
Oppo Reno 13 Features – Oppo Reno 13 మెుబైల్ 6.59 అంగుళాల AMOLED డిస్ ప్లేతో వచ్చేసింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ రావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం బెస్ట్ కెమెరా ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ColorOS 15తో టాప్ లో ఉన్న Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5600mAh బ్యాటరీ, 12GB RAM + 256GB స్టోరేజ్ తో వచ్చేసింది.
చైనాలో రెనో 13 గెలాక్సీ బ్లూ, బటర్‌ఫ్లై పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. 12GB+ 256GB వేరియంట్ ధర రూ. 31,429, 12GB+ 512GB వేరియంట్ ధర రూ. 34,923, 16GB+ 256GB 2999 వేరియంట్ ధర రూ.34,923, 16GB+ 512GB వేరియంట్ ధర రూ.38,417, 16GB+ 1TB 3799 వేరియంట్ ధర రూ.44,239గా ఉంది.
Oppo Reno 13 Pro Features – 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌లో అదే ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ColorOS 15 పై పనిచేస్తుంది. 50Mp ప్రైమరీ షూటర్, 3.5X జూమ్‌తో 50MP షూటర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 5640mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
రెనో 13 ప్రో మోడల్‌ను స్టార్‌లైట్ పింక్, బటర్‌ఫ్లై పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. 3399 యువాన్స్ అంటే సుమారు 39,581 ధరతో 12+ 256GB మోడల్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉంది. 12GB+ 256GB వేరియంట్ ధర రూ.39,581, 12GB+ 512GB వేరియంట్ ధర రూ.43,075, 16GB+ 512GB వేరియంట్ ధర రూ.46,568, 16GB+ 1TB వేరియంట్ ధర రూ.52,391గా ఉంది.
ALSO READ : ఏంటి భయ్యా ఇది.. బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొత్త ఫోన్స్ పై ఏకంగా రూ.35 వేలు తగ్గింపా!