Black Friday Sale 2024 : ప్రముఖ స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే. నవంబర్ 22న ప్రారంభమైన ఈ శాంసంగ్ ఫ్రైడే సేల్ డిసెంబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు గ్యాడ్జెట్‌లను భారీ డిస్కౌంట్ ధరలకే అందిస్తున్నారు. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా క్యాష్‌బ్యాక్, నోకాస్ట్ EMI సహా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, లాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్, టీవీల దగ్గర నుంచి బట్టలు, మీ ఇంటికి కావలసిన వస్తువులు అన్ని ఈ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తాయి. అయితే శాంసంగ్, తన సంస్థకు చెందిన టాప్ హై ఎండ్ ఫీచర్స్ ఉన్న ఫోల్డబుల్ డివైసెస్‌పై కూడా అదిరే ఆఫర్లను ప్రకటించింది.
దీంతో ఇప్పుడు Galaxy Z Fold 6 రూ.1,44,999కే అందుబాటులోకి వచ్చింది. దాని ఒరిజినల్ ధర Rs. 1,64,999. అంటే దాదాపు రూ.20 వేల తగ్గించి యూజర్స్‌కు అందుబాటులో ఉంచింది. Galaxy Z Flip 6 రూ.Rs. 89,999కే దొరుకుతోంది. దాని ఒరిజినల్ ధర Rs. 1,09,999. అంటే దీనిపై కూడా దాదాపు రూ.20 వేల డిస్కౌంట్ లభిస్తోంది. పైగా ఈ రెండు మోడల్స్‌కు 24 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ వెసులుబాటును కల్పించింది శాంసంగ్. నెలవారీగా ఫ్లిప్ మోడల్‌కు రూ.2500 నుంచి, ఫోల్డ్ మోడల్‌కు రూ.4,028 నుంచి ఈఎమ్ఐ కట్టుకునే వీలును కల్పించింది.
ఇక ప్రముఖ 256 జీబీ స్టోరేజ్ ఉన్న Galaxy S24 Ultra రూ.Rs. 1,09,999కు దొరుకుతోంది. రూ.8 వేల ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్, రూ.12 వేల అప్‌గ్రేడ్ బోనస్‌ను ఇస్తోంది. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.1,29,999. అదనంగా బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.12 వేలు అందిస్తోంది.
128 జీబీ Galaxy S24 వెర్షన్‌ను రూ.61,999కే వచ్చేసింది. అది కూడా అప్‌గ్రేడ్ బోనస్ రూ.13 వేలతో. దీని మార్కెట్ లాంఛ్ ప్రైజ్ రూ.74,999. ఇక రూ.99,999 ధర ఉన్న 256 జీబీ Galaxy S24 ప్లస్ రూ.64,999కే అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపుగా రూ.35 వేల తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చిందనమాట.
ఇంకా రూ. 1,24,999 ధర ఉన్న Galaxy S23 Ultra 256 జీబీ వెర్షన్ రూ.74,999కు, రూ. 74,999 ధర ఉన్న Galaxy S23 128 జీబీ మోడల్ రూ. 38,999కు అందిస్తోంది. ఇక రూ.54,999 ధర ఉన్న Galaxy S23 FE బేస్ మోడల్ 128 జీబీ స్టోరేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్ రూ. 25 వేల భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.29,999కు దొరుకుతోంది.
కాబట్టి ఆలస్యం ఎందుకు మీకు కావాల్సిన హై ఎండ్ ఫీచర్స్ ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్స్ ను త్వరగా కొనేయండి. ఈ బ్లాక్ ఫ్రైడ్ సేల్ ఆఫర్‌ను శాంసంగ్ వైబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, టాటా క్లిక్ సహా మరిన్ని స్టోర్‌లలో ఉపయోగించుకోవచ్చు.
ALSO READ : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై క్యూాఆర్ కోడ్ తో పాన్ కార్డ్స్