OPPO Reno 13 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో లైన్ అప్ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్ కు సిద్ధమవుతుంది. త్వరలోనే ఒప్పో రెనో 13 సిరీస్ (Oppo Reno 13 Series) రాబోతుంది. ఈ మెుబైల్ లాంఛ్ డేట్ ఫిక్స్ అవ్వటంతో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరోసారి వైరల్ గా మారాయి. ఇక ఒప్పో రెనో 13 లాంఛ్ డేట్, కెమెరా, డిస్ ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ ఫీచర్స్ చూసేయండి.
టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో… తాజాగా మరో సిరీస్ ను లాంఛ్ చేసేందుకు సిద్దమైంది. ఒప్పో రెనో 13 పేరుతో కొత్త సిరీస్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. ఇక ఈ మెుబైల్ నవంబర్ 25న చైనాలో లాంఛ్ కాగా.. తాజాగా ఇండియా లాంఛ్ డేట్ కన్ఫామ్ అయింది. జనవరి 9న ఒప్పో రెనో సిరీస్ లో రెండు మెుబైల్స్ ఇండియా మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఒప్ప ప్రతీ 6 నెలలకు ఒకసారి రెనో సిరీస్ ను లాంఛ్ చేస్తుంది. గత ఏడాది నవంబర్ లో ఒప్పో 11 లాంఛ్ కాగా… ఈ ఏడాది మేలో ఒప్పో రెనో 12 ప్రో, ఒప్పో 12 5G మెబైల్స్ లాంఛ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ ను జోడిస్తూ ఒప్పో తన తాజా వెర్షన్ ఒప్పో 13 సిరీస్ ను తీసుకురాబోతుంది.
Oppo Reno 13 Series Features –
Display – 6.78 అంగుళాల 1.5K (1,264 x 2,780 pixels) డిస్ ప్లే, క్వాడ్ మైక్రో కర్వ్డ్ LTPO OLED స్క్రీన్ తో రాబోతుంది.
Camera – ఒప్పో రెనో 13 మెుబైల్ లో కెమెరా ఫీచర్స్ సైతం అధునాతనంగా ఉన్నాయి. ఒప్పో 13 కెమెరా 50Mp పెరీస్కోప్ టెలీలెన్స్ తో రాబోతుంది. రెనో 12 ప్రో 5G లో 2X జూమ్ సదుపాయం ఉండగా ఈ 13 సిరీస్ లో 3x ఆప్టికల్ జూమ్ ను ఒప్పో డిజైన్ చేసింది.
Processor – ఒప్పో రెనో 13 ప్రో మీడియా టెక్ డైమెన్సిటీ 9300 చిప్ సెట్ తో లాంఛ్ కానుంది.
Battery – 80W వైర్డ్ ఛార్జింగ్ 50W వైర్ లెస్ ఛార్జింగ్, 5900mah బ్యాటరీతో రాబోతుంది. ఇక డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ గా ఈ మెుబైల్ లాంఛ్ కాబోతుంది.
ఇక ధర విషయానికి వస్తే… Oppo Reno 12 Pro 5G మెబైల్స్ లాంఛ్ అయ్యి అందుబాటు ధరలలోనే మార్కెట్లోకి వచ్చాయి. ఈ సిరీస్ లో 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 36,999, 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 40,999గా ఉంది. ఒప్పో రెనో 13 లో లేటెస్ట్ అప్డేట్స్ ను ఉంచటంతో ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది జనవరిలో టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో సామ్సాంగ్ గెలక్సీ s25 సిరీస్, వన్ ప్లస్ 13, ఒప్పో రెనో 13, పోకో ఎక్స్7 సిరీస్, రెడ్‌మీ 14C, రియల్‌మీ 14ప్రో కూడా ఉన్నాయి. ఈ మొబైల్స్ అన్ని ఒకదానికొకటి పోటీపడతూ టాప్ ఫీచర్స్ తో రాబోతున్నాయి.
ALSO READ : గెలాక్సీ S25, వన్‌ప్లస్ 13, రెనో 13.. జనవరిలో రాబోతున్న టాప్ మెుబైల్స్ ఇవే!