Daaku Maharaj : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishan) ఈసారి సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాలయ్య అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఓవర్సీస్ లో ‘డాకు’ కష్టమేనని అంటున్నారు. దానికి రిలీజ్ డేట్ ను కారణంగా చూపిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ ను శ్లోకా ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తీసుకున్నాయి.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ ఇదే కావడంతో, ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj)పై భారీ క్రేజ్ ఏర్పడింది. పైగా ‘వీర సింహారెడ్డి’ మూవీ తో ఇదే సంక్రాంతికి బాలయ్య 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబట్టిన సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న ‘డాకు మహారాజ్’ మూవీని బయ్యర్స్ ‘దేవర’ కంటే భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
కానీ మరోవైపు చూస్తే అసలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) మూవీ రీచ్ అవ్వడం సాధ్యమేనా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ‘గేమ్ ఛేంజర్’ మూవీ. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అందుకే సెంటిమెంట్ గా భావించే ఫ్రై డేని చెర్రీకి వదిలేసి, తర్వాత రెండు రోజులకే ‘డాకు మహారాజ్’ థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది.
కానీ ఆ రోజు ఆదివారం రావడమే సమస్యగా మారినట్టు తెలుస్తోంది. బాలయ్యకి తెలుగు స్టేట్లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ వారంతో పెద్దగా పని లేదు. ఎందుకంటే ఆ తర్వాత మొత్తం సంక్రాంతి హాలిడేస్ వారం పాటు ఉంటాయి. కాబట్టి మూవీ ఆదివారమే రిలీజ్ అయినా ఆడియన్స్ హ్యాపీగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ ఓవర్సీస్ లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ మనలాగా వారం పాటు సంక్రాంతి సెలవులు ఉండవు. కాబట్టి ఓవర్సీస్ జనాలు సినిమాలను చూసేది వీకెండ్స్ అయిన శని, ఆదివారాలు మాత్రమే. డైహార్డ్ ఫ్యాన్స్ తప్ప ఫస్ట్ డే సినిమాను చూడడానికి ఓవర్సీస్ జనాలు పెద్దగా ఆసక్తిని చూపించరు. ఒకవేళ మొదటిరోజు రిలీజ్ అయ్యి, పాజిటివ్ టాక్ వస్తే, ఆ తర్వాత సినిమాను చూడాలని భావిస్తారు. అంటే మూవీ శుక్రవారం రిలీజ్ అయితే శని, లేదా ఆదివారం సినిమా చూడడానికి ఆసక్తిని కనబరుస్తారు.
కానీ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) లక్కీగా ఆ రిలీజ్ డేట్ ను కబ్జా చేసింది. దీంతో ‘డాకు మహారాజ్’కు మొదటి రోజు ఆదివారం కాబోతోంది. అంటే ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునేలోపు వీకెండ్ పూర్తయిపోతుంది. ఇక వీక్ డేస్ లో జనాలు పెద్దగా థియేటర్లకి రారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఓవర్సీస్ లో ప్రీమియర్స్ వేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. ఇది కొంతవరకు వర్కౌట్ అయినప్పటికీ, ఒక్క ఆదివారం థియేట్రికల్ రన్ తో అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే. ఎందుకంటే ఓవర్సీస్ లో ఈ సినిమాకు కోటి వరకు బిజినెస్ జరిగినట్టుగా టాక్ నడుస్తోంది. కాబట్టి ఓవర్సీస్ లో ఒక్కరోజులోనే కోటి రూపాయలు వసూలు చేయడం అంటే కత్తి మీద సామే. మరి ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతాడో చూడాలి.