BigTV English

January 2025 Mobiles : గెలాక్సీ S25, వన్‌ప్లస్‌ 13, రెనో 13.. జనవరిలో రాబోతున్న టాప్ మెుబైల్స్ ఇవే!

January 2025 Mobiles : గెలాక్సీ S25, వన్‌ప్లస్‌ 13, రెనో 13.. జనవరిలో రాబోతున్న టాప్ మెుబైల్స్ ఇవే!

January 2025 Mobiles : కొత్త ఏడాది మొదలైంది.. స్మార్ట్ ఫోన్స్ సందడి కూడా మొదలైపోయింది. ఇక తమ యూజర్స్ అభిరుచికి తగ్గట్టు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ కొత్త మొబైల్స్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక జనవరి రెండో వారంలో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. అయితే ఏ ఏ మొబైల్స్ జనవరిలో మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇక వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయో మీరూ ఓ లుక్కేసేయండి.


జనవరిలో టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో సామ్సాంగ్ గెలక్సీ s25 సిరీస్, వన్ ప్లస్ 13, ఒప్పో రెనో 13 ఉన్నాయి. వీటితో పాటు పోకో ఎక్స్7 సిరీస్‌, రెడ్‌మీ 14C, రియల్‌మీ 14ప్రో కూడా ఉన్నాయి.

Samsung Galaxy S25 Series – 


‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌’ జనవరి 22న నిర్వహించనుంది ఆ సంస్థ. ఇందులో గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను లాంఛ్ చేయనుంది. గెలాక్సీ ఎస్‌25, గెలాక్సీ ఎస్‌25 ప్లస్‌, గెలాక్సీ ఎస్25 అల్ట్రా.. మోడల్స్ రాబోతున్నాయి. బెస్ట్ ప్రాసెసర్ తో కెమెరా ఫీచర్స్ తో ఈ మెుబైల్స్ వచ్చేస్తున్నాయి.

Oneplus 13 Series –

వన్ ప్లస్ 13 సిరీస్ లో భాగంగా రెండు మొబైల్స్ రాబోతున్నాయి. జనవరి 7న జరిగే వింటర్ లాంఛ్ ఈవెంట్ లో భాగంగా ఈ మొబైల్స్ రాబోతున్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎలైట్‌ చిప్‌సెట్‌తో వన్ ప్లస్ 13 మొబైల్ వస్తుండగా.. స్నాప్ డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్ తో వన్ ప్లస్ 13R రాబోతుంది. ఇక ఈ ఈవెంట్ లో ఇయర్ బర్డ్స్, ట్యాబ్‌ సైతం వచ్చేస్తున్నాయి.

Oppo Reno 13 Series –

ఒప్పో లైన్ అప్ సిరీస్ లో మరో రెండు మోడల్స్ లాంఛ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ మెుబైల్ లాంఛ్ జనవరి చివరలో జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఒప్పో రెనో 13 5జీ, ఒప్పో రెనో 13 ప్రో 5జీ పేరిట మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో ఈ మెుబైల్స్ రాబోతున్నాయి. 5640mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ వచ్చేశాయి.

Realme 14 pro – 

రియల్‌మీ నుంచి Realme 14 pro సిరీస్‌ జనవరిలో లాంఛ్ కాబోతున్నాయి. కెమెరా సెంట్రిక్‌ స్మార్ట్‌ ఫోన్‌ IP69 రేటింగ్‌తో ఈ మెుబైల్ వచ్చేస్తుంది. అయితే ఇప్పటికే ఫీచర్స్ టెక్ ప్రియులను ఆకట్టుకున్నప్పటికీ మెుబైల్ లాంఛ్ డేట్ మాత్రం రియల్ మీ ప్రకటించలేదు.

Poco X7 Series – 

Poco జనవరి 7న X7 సిరీస్‌ ను లాంఛ్ చేయనుంది. Poco X7 5G, Poco X7 Pro 5G మెుబైల్స్ ఎల్లో, బ్లాక్‌ రంగుల్లో, లెదర్‌ ఫినిష్‌తో రాబోతున్నాయి. ఈ మెుబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయోలా ఉన్నాయి.

Redmi 14C – 

ఈ కొత్త ఏడాది బడ్జెట్‌ లో బెస్ట్ మొబైల్స్ తీసుకొచ్చేందుకు రెడ్ మీ సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 6న రెRedmi 14C పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌2 ప్రాసెసర్‌, 5160mAh బ్యాటరీతో ఈ మెుబైల్స్ వచ్చేస్తున్నాయి.

ALSO READ : వాట్సాప్ కాల్ షెడ్యూల్ ఆప్షన్.. ఎలా ఉపయోగించాలో తెలుసా!

Related News

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Xiaomi Rival iPhone 17: ఐఫోన్ 17కు సవాల్.. రాబోతోంది షావోమీ సూపర్ ఫోన్

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Big Stories

×