BigTV English

Realme Narzo N65 5G First Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ స్టార్ట్.. మిస్ అయితే చాలా కష్టం..!

Realme Narzo N65 5G First Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ స్టార్ట్.. మిస్ అయితే చాలా కష్టం..!

Realme Narzo N65 5G First Sale: టెక్ కంపెనీ రియల్‌మీ ఇటీవల భారతదేశంలో Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. 5G నెట్‌వర్క్ కనెక్టివిటీతో వస్తున్న Realme N సిరీస్‌లో ఇది మొదటి స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఈరోజు అంటే మే 31 స్టార్ట్ కానుంది . Realme మే 31- జూన్ 3 మధ్య ఈ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ మొదటి ఫ్లాష్ సేల్‌ తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఫోన్ల కొనుగోలుపై అనేక రకాల ఆఫర్లు ఇస్తున్నారు. ఈ ఫోన్ మొదటి సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.


Realme ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 4GB RAM + 128GB, 6GB RAM + 128GB. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.11,499. దీని టాప్ వేరియంట్ ధర రూ.12,499. Realme ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 1,000 తక్షణ తగ్గింపు ఆఫర్ ఇస్తుంది. ఈ ఫోన్‌ను రూ.10,499 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. మీరు దీన్ని రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. అందులో అంబర్ గోల్డ్, డీప్ గ్రీన్ ఉన్నాయి.

Realme Narzo N65 5G Features
Realme ఈ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పంచ్-హోల్ డిజైన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే ఐఫోన్ లానే డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా ఫోన్ డిస్‌ప్లేలో అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు దీని పీక్ బ్రైట్నెస్ 625 నిట్‌ల వరకు ఉంటుంది.


Also Read: ఆఫర్ల జాతర.. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఒక్కటి చాలు బాబాయ్..!

Realme Narzo N65 5G బ్యాక్ సర్క్యులర్ కెమెరా డిజైన్ ఇచ్చారు. ఫోన్ 50MP మెయిన్, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ Realme ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రొటెక్ష్న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Also Read: అరే ఎంట్రా ఇది.. AI ఫీచర్లతో Realme బడ్జెట్ ఫోన్.. అదరిపోయింది అంతే..!

ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్‌లో 6GB RAM వరకు సపోర్ట్ ఇస్తుంది. దీని ర్యామ్‌ను వర్చువల్‌గా 6GB వరకు పెంచుకోవచ్చు. ఇది కాకుండా ఫోన్‌కు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 15W USB టైప్ C ఛార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్ Android 14 బేస్డ్ Realme UI 5.0 పై పని చేస్తుంది.

Tags

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×