E-Paper
Advertisement

Oppo Reno 12 Series: చాలా రోజులకు ఒప్పో నుంచి కిరాక్ ఫోన్లు.. మొబైల్ అంటే ఇలా ఉండాలి బ్రో!

Oppo Reno 12 Series: చాలా రోజులకు ఒప్పో నుంచి కిరాక్ ఫోన్లు.. మొబైల్ అంటే ఇలా ఉండాలి బ్రో!
Advertisement

Oppo Reno 12 Series Launch: Oppo స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంపెనీ తన రెనో 12 సిరీస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. Oppo తన కొత్త సిరీస్ లాంచ్ తేదీ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే ఇంతలోనే ఈ సిరీస్ ఫోన్లకు సంబంధించి కొన్ని లీక్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అలానే రెనో 12 సిరీస్ లాంచ్ తేదీని లీక్ చేశారు.

లీక్ ప్రకారం ఒప్పో రెనో 12 సిరీస్ కొత్త ఫోన్‌లు జూన్ 18 సాయంత్రం 5 గంటలకు లాంచ్ అవుతాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లు ఐరోపాలో విడుదల కానున్నాయి. ఇదే రోజున ఈ రెనో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్ మార్కెట్‌లో కూడా లాంచ్ కావచ్చు. కంపెనీ ఈ కొత్త రెనో సిరీస్‌లో మెయిన్‌గా కెమెరా సెటప్, ప్రాసెసర్‌ చాలా బెటర్ క్వాలిటీ, పర్ఫామెన్స్ ఇస్తాయి.

Advertisement

Also Read: మోటో నుంచి వేరే లెవల్ ఫోన్.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫీచర్లు.. మామూలు స్కెచ్ కాదు!

రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు గురించి చెప్పాలంటే ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం Oppo కొత్త ఫోన్‌లు 1080×2412 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3D AMOLED డిస్‌ప్లే 1200 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కంపెనీ రెనో 12లో గొరిల్లా గ్లాస్ 7ఐని, 12 ప్రోలో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని తీసుకొచ్చింది. ఈ రెనో సిరీస్ ఫోన్లు 12 GB RAM+ 512 GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తాయి.

Advertisement

రెనో 12 సిరీస్‌లో ప్రాసెసర్‌గా Mali G615 GPUతో డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లు సోనీ LYT 600 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. సిరీస్ బేస్ వేరియంట్‌లో మీరు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు.

Also Read: దీన్ని కొట్టేదేలేదు.. వివో బడ్జెట్ 5G ఫోన్.. తక్కువ ధరకు దుమ్ములేపుతుంది!

అదే సమయంలో ఒప్పో కంపెనీ ప్రో వేరియంట్‌లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను తీసుకురానుంది. లీక్ ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌లలో 5000mAh బ్యాటరీని అందిస్తుంది. ఇది 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ నానో సిమ్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×