E-Paper
Advertisement

Kalki 2898 AD: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన ‘కల్కి 2898 ఏడీ’

Kalki 2898 AD: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన ‘కల్కి 2898 ఏడీ’
Advertisement

Kalki 2898 AD Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’ మూవీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై యావత్ ప్రపంచ సినీ ప్రియులు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ లుక్ హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. బాడీ మొత్తం సూట్ ధరించి కనిపించడంతో ప్రభాస్ హాలీవుడ్ మార్వెల్ స్టైల్‌లో ఉన్నాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.

అంతేగాక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. సేమ్ టు సేమ్ హాలీవుడ్ మూవీ సినిమాలా ఉంది. దీంతో యూట్యూబ్‌లో రిలీజ్ అయిన అతి కొద్ది గంటల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేక్షకులు, అభిమానులు ఈ ట్రైలర్‌ చూసి ఆశ్చర్యపోయారు. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించిందని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది.

Advertisement

Also Read: ట్రెండింగ్‌లో ‘కల్కి’ ట్రైలర్.. ఎమోషనల్ అయిన డైరెక్టర్

ఇకపోతే ఈ మూవీ ఈ నెల అంటే జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవల ఓపెన్ అయ్యాయి. అయితే ఈ బుకింగ్స్ విషయంలో కల్కి మూవీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డును బద్దలు కొట్టింది. అమెరికాలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రీ సేల్స్ తాజాగా 1 మిలియన్ మార్కును దాటాయి.

Advertisement

సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. ఈ తరుణంలో ఈ రేంజ్‌లో ప్రీ సేల్ జరగడం ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇది మాత్రమే కాదు.. అత్యంత వేగంగా 1 మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా కూడా ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. దీని బట్టి చూస్తుంటే.. కల్కి మూవీ రిలీజ్ అనంతరం ఎన్నో బడా సినిమాల రికార్డులను బద్దలు కొడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×