BigTV English

Satellite Crashes On Earth: పసిఫిక్‌లో కూలిన ERS-2 ఉపగ్రహం..

Satellite Crashes On Earth: పసిఫిక్‌లో కూలిన ERS-2 ఉపగ్రహం..

Satellite Crashes On Earth Over Pacific Ocean: యూరోపియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ERS-2 ఉత్తర పసిఫిక్ సముద్రంలో కూలిపోయింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్ర గాలుల గురించి విలువైన సమాచారాన్ని అందించిన ఆ ఉపగ్రహం బుధవారం రాత్రి భూవాతావరణంలోకి ప్రవేశించింది.


రీఎంట్రీ అనంతరం కాలిపోయి అలాస్కా-హవాయ్ మధ్య పసిఫిక్‌లో కూలిపోయింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) 1990లలో ERS-1 తో పాటు ERS-2ను ప్రయోగించింది.

Read More: ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ సేల్ ప్రారంభం.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10వేలే..!


16 ఏళ్ల పాటు ERS-2 ఉపగ్రహం భూమిని నిశితంగా పరిశీలించి విలువైన సమాచారాన్ని అందించింది. 2011లో దాని సేవలు నిలిచిపోయాయి. దాదాపు రెండున్నర టన్నుల బరువున్న ఈ ఉపగ్రహం కూలిపడినా ఆస్తి, ప్రాణ నష్టం ఏదీ సంభవించలేదని తెలుస్తోంది. నియంత్రించాల్సిన పని లేకుండా సహజ పద్ధతిలోనే అది కూలిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags

Related News

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×