BigTV English

Congress-AAP: ఢిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి.. ఆప్‌ కి నాలుగు.. కాంగ్రెస్‌కి మూడు..

Congress-AAP: ఢిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి.. ఆప్‌ కి నాలుగు.. కాంగ్రెస్‌కి మూడు..

Congress-AAP alliance: ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఓ అంగీకారానికి వచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నిక వేళ కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చినట్లు వచ్చింది. ఢల్లీలో ఏడు స్థానాల్లో ఆఫ్ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే దీనిపై ఆ పార్టీల నుంచి త్వరలోనే ప్రకటన వెలువడనుంది.


తమ రెండు పార్టీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.

మొదట పొత్తలో భాగంగా కాంగ్రెస్ కు ఆప్ ఒక్క సీటు ఆఫర్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ కు ఒక్క సీటే ఎక్కువ, పొత్తు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ొక్కటీ ప్రతిపాదించామని ఆప్ ఎంపీ సందీప్ పాథక్ గతంలో వ్యాఖ్యలు చేశారు. దాంతో రెండు పార్టీల మద్య పొత్తు కుదరకపోవచ్చనే వార్తలు వినిపించాయి. కాగా.. త2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఏడు ఎంపీ సీట్లను బీజేపీనే సొంతం చేసుకుంది.


ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బుధవారం వివక్ష ఇండియా కూటమిలో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. యూఫీలో 80 స్థానాలకు గానూ 17 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనుంది. మిగిలిన 63 చోట్ల సమాజ్ వాదీ పార్టీ, ఇతర మిత్ర పక్షాలు బరిలో దిగనున్నారు.

కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో రాయ్బరేలీ, అమేఠీ, వారణాసి, ఝాన్సీ, మధుర, గాజియాబాద్ వంటివి ఉన్నాయి. ప్రతిష్టంభనకు తొలగించడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవ తీసుకున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు ఫోన్లో మాట్లాడడంతో పొత్తుకు మార్గం సుగమం అయ్యింది.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×