E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ఫ్యామిలీ సైజ్ ఎయిర్ ఫ్రయర్ కావాలా?రూ.2,999కే సూపర్ డీల్!

బడ్జెట్ ధరలో ఫ్యామిలీ సైజ్ ఎయిర్ ఫ్రయర్ కావాలా?రూ.2,999కే సూపర్ డీల్!
Advertisement

Pigeon 4.2l air fryer: ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న..ఈ రోజుల్లో డీప్ ఫ్రై వంటకాలకు దూరంగా ఉంటూనే,నూనె లేకుండా కరకర లాడే స్నాక్స్ తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ కిచెన్ అప్లయన్స్ బ్రాండ్ పీజియన్ నుంచి వచ్చిన ‘హెల్తీఫ్రై డిజిటల్ ఎయిర్ ఫ్రయర్’ ఒక అద్భుతమైన ఆప్షన్. కేవలం రూ.2,999కే 4.2 లీటర్ల కెపాసిటీ, 1200W పవర్, 360 డిగ్రీల ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీతో..అందుబాటులో ఉన్న ఈ ట్రెండీ కిచెన్ గాడ్జెట్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా.. దీని డిజైన్, కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే.. ఇది గ్రీన్ కలర్‌లో వస్తోంది. కిచెన్లో పెట్టినప్పుడు చాలా మోడ్రన్‌గా, క్లాసీగా కనిపిస్తుంది.ఇందులో 4.2 లీటర్ల పెద్ద నాన్-స్టిక్ ఫుడ్ బాస్కెట్ ఇచ్చారు.ఈ సైజు ఒక చిన్న లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సరిపడా స్నాక్స్ లేదా వంటకాలను ఒకే సారి తయారు చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. నాన్-స్టిక్ కోటింగ్ ఉండటం వల్ల ఆహారం అడుగు అంటకుండా ఉండటమే కాకుండా..వాడిన తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ.

Advertisement

పనితీరు విషయానికి వస్తే..ఇందులో 1200 వాట్ల పవర్ ఫుల్ హీటింగ్ ఎలిమెంట్‌ను అందించారు. దీనికి తోడు 360 డిగ్రీల హై-స్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉండటం వల్ల వేడి గాలి బాస్కెట్ లోపల అన్ని.. వైపులా సమానంగా ప్రసరిస్తుంది. ఫలితంగా.. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, నగ్గెట్స్, పనీర్ టిక్కా, చికెన్ వింగ్స్ వంటివి తక్కువ సమయంలోనే.. లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా ఉడుకుతాయి. సాధారణ వంటకాలతో ..పోలిస్తే దాదాపు 85 శాతం వరకు తక్కువ నూనెతోనే.. వంట పూర్తి చేసుకోవచ్చు. నూనె వాడకుండా దీనిలో తయారు చేసుకునే స్నాక్స్ కూడా చాలా రుచికరంగా ఉంటాయి. తక్కువ టైంలో ఈజీ స్నాక్స్ రెడీ చేయడం కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ధమాకా..65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Advertisement

ఇది డిజిటల్ మోడల్ కావడంతో టచ్ కంట్రోల్స్, డిజిటల్ డిస్‌ప్లే.. వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.ఇందులో 8 ప్రీసెట్ మెనూ ఆప్షన్లు ఇచ్చారు.అంటే.. మనం ఏ వంటకం చేస్తున్నామో సెలెక్ట్ చేస్తే చాలు, దానికి తగిన ఉష్ణోగ్రత, టైమ్ ఆటోమేటిక్‌గా.. సెట్ అవుతాయి.అంతే కాకుండా 80 డిగ్రీల నుంచి 200 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ కంట్రోల్ చేసుకునే వెసులు బాటు, అలాగే ముందుగానే.. కుకింగ్ షెడ్యూల్ చేసుకునే డిలే స్టార్ట్ ఫంక్షన్ కూడా ఇందులో ఉన్నాయి.కేవలం ఫ్రైయింగ్ మాత్రమే కాకుండా బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, డీఫ్రాస్ట్ వంటి పనులను కూడా దీంతో ఈజీగా చేసుకోవచ్చు.

కేవలం రూ.2,999 బడ్జెట్ ధరలో 4.2 లీటర్ల కెపాసిటీ, డిజిటల్ టచ్ కంట్రోల్స్, 1200వాట్ల పవర్, 2 సంవత్సరాల వారంటీతో.. వస్తున్న ఈ పీజియన్ హెల్తీఫ్రై డిజిటల్ ఎయిర్ ఫ్రయర్ ఆరోగ్యకరమైన, రుచి కరమైన వంటలు కోరుకునే ప్రతి ఇంటికీ ఒక వాల్యూ ఫర్ మనీ గాడ్జెట్ అని చెప్పొచ్చు.

Related News

రూ.899కే 50 గంటల బ్యాటరీ!ఫైర్-బోల్ట్ ఏరో ప్రో ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్

iPone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

జియో యూజర్లు ఎగిరి గంతేసే ప్లాన్.. రూ.1000 రీఛార్జ్ చేస్తే రూ.1000 వోచర్లు, ఏడాది పాటు Canva Pro ఫ్రీ!

10 నిమిషాల్లో డెలివరీ, రూ.22,000 తగ్గింపు.. Motorola Edge 70 Fusionపై క్రేజీ బ్లాక్ ఫ్రైడే డీల్!

అచ్చం మన పక్కంటి వాళ్లు దారి చెప్పినట్టే చెప్తోంది.. Apple Mapsలో వచ్చిన ఈ 3 కొత్త అప్డేట్స్ చూశారా?

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ధమాకా..65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

జియో నుంచి క్రేజీ రీఛార్జ్ ప్లాన్.. 98 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5G డేటా.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్!

Big Stories

Advertisement
×