fire boltt earbuds: తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఇయర్ బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే.. ఫైర్-బోల్ట్ నుంచి వచ్చిన కొత్త ‘ఏరో ప్రో’ ఇయర్‌బడ్స్ మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. కేవలం రూ.899ధరలోనే 50 గంటల ప్లేబ్యాక్, కస్టమ్ ఈక్వలైజర్ ప్రొఫైల్స్, క్వాడ్ మైక్ ఈఎన్షీ, లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వంటి ప్రీమియం ఫీచర్లతో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. సేజ్ కలర్‌లో స్టైలిష్‌గా కనిపించే ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
ఈ ఇయర్‌బడ్స్‌లో ముందుగా ఆకట్టుకునే విషయం దీని డిజైన్ , కలర్. ముఖ్యంగా సేజ్ కలర్ వేరియంట్ చాలా క్లాసీగా, ట్రెండీగా కనిపిస్తోంది. చెవిలో.. పెట్టుకున్నప్పుడు చాలా తేలికగా, కంఫర్టబుల్‌గా ఉండేలా.. ఎర్గోనామిక్ డిజైన్‌తో వీటిని తయారు చేశారు. ఎక్కువ సేపు వాడినా చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఫిట్ ఇచ్చారు.
సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే.. ఇందులో ఉన్న కస్టమ్ EQ ప్రొఫైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సాధారణంగా వెయ్యి రూపాయల లోపు ఇయర్ బడ్స్‌లో ఇలాంటి ఫీచర్ తక్కువగా కనిపిస్తుంది. మన మూడ్‌కు తగ్గట్టుగా బేస్ ఎక్కువగా కావాలన్నా, క్లియర్ వోకల్స్ కావాలన్నా లేదా బ్యాలెన్స్‌డ్ సౌండ్ కావాలన్నా ఈక్వలైజర్ ప్రొఫైల్స్ మార్చుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.
కాల్స్ మాట్లాడేటప్పుడు.. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇందులో క్వాడ్ మైక్ ENCటెక్నాలజీని అందించారు. నాలుగు మైకులు ఉండటం వల్ల ట్రాఫిక్‌లో ఉన్నా, బయట రద్దీ ప్రదేశాల్లో ఉన్నా అవతలి వారికి మన వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, రెగ్యులర్‌గా కాల్స్ మాట్లాడేవారికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.
కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వెర్షన్ ఇచ్చారు. దీని వల్ల ఫోన్‌కు చాలా వేగంగా కనెక్ట్ అవ్వడమే కాకుండా.. సిగ్నల్ డ్రాప్ అవ్వకుండా స్థిరమైన కనెక్షన్ ఉంటుంది. అంతే కాకుండా గేమ్స్ ఆడేటప్పుడు ఆడియో లాగ్ తక్కువగా ఉండి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
బ్యాటరీ బ్యాకప్ పరంగా.. కూడా ఫైర్-బోల్ట్ ఏరో ప్రో బెస్ట్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల వరకు ప్లేటైమ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజువారీ వాడకంలో ఈజీగా మూడు నాలుగు రోజుల పాటు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం మరో ప్లస్ పాయింట్.
కేవలం రూ.899 బడ్జెట్‌లో 50 గంటల బ్యాటరీ, కస్టమ్ ఈక్యూ ప్రొఫైల్స్, క్వాడ్ మైక్ , బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ మోడల్ ఒక వాల్యూ ఫర్ మనీ డీల్ అని చెప్పొచ్చు.