E-Paper
Advertisement

Hydroxide:- గాలిలో కాలుష్యాన్ని కంట్రోల్ చేసే ఓహెచ్..

Hydroxide:- గాలిలో కాలుష్యాన్ని కంట్రోల్ చేసే ఓహెచ్..
Advertisement

Hydroxide:- ఈరోజుల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. మనుషులు చేసే ప్రతీ పని ఏదో విధంగా గాలిలోకి కాలుష్యాన్ని వదులుతూనే ఉంది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు.. ఇలా మరెన్నో సంస్థలు గాలిలోకి విష వాయువులను వదులుతూ మనుషుల పీల్చుకునే ఊపిరిని కూడా కలుషితం చేస్తున్నాయి. ఈ కాలుష్యం అనేది గాలిలో నుండి బయటికి వేళ్లే మార్గం లేక అందులోనే తిరుగుతూ ఉంది. అలా కాకుండా గాలి తనంతట తానే కాలుష్యాన్ని శుభ్రం చేసుకోగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గాలిలో ఉండే హైడ్రోక్సైడ్ (ఓహెచ్) అనే మాలిక్యూల్ లేకపోతే.. గాలిలోనే కాలుష్యం నిండిపోయి మానవాళి ప్రాణానికి మరింత ముప్పుగా మారేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు చేసిన అనేక పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. కానీ ఓహెచ్ అనేది అసలు ఎలా తయారవుతుందో వారు తెలుసుకోవాలనుకున్నారు. దానిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఒక తెలియని మెకానిజం ద్వారా ఓహెచ్ ఏర్పడుతుందని వారు గ్రహించారు.

Advertisement

గ్రీన్ హౌస్ గ్యాసుల నుండి, మనుషులు వదిలే కాలుష్యం నుండి గాలి తనంతట తానుగా ఎలా శుభ్రపరచుకుంటుంది అని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా స్టడీ మొదలుపెట్టారు. కాలుష్యంతో ఓహెచ్ రియాక్ట్ అయ్యి గాలిలోని కాలుష్యాన్ని పోగొడుతుందని వారు కనుగొన్నారు. అంతే కాకుండా ఓహెచ్ అనేది హైడ్రో కార్బన్స్‌ను ఆక్సిజన్‌లాగా మారుస్తుందని కూడా తెలిపారు. అలా జరగకపోయింటే గాలిలో కార్బన్ డయాక్సైడ్ అనేది విపరీతంగా పెరిగిపోయేదని వారు చెప్తున్నారు.

ఓహెచ్ అనేది గాలిలో కీ ప్లేయర్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది గాలిలోని సల్ఫర్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వంటి కెమికల్స్‌ను దూరం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి వాతావరణానికి తీవ్రమైన హాని కలిగించే విషపూరితమైన గ్యాసులని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికే యూరోప్‌లోని ఒక ల్యాబ్‌లో ఓహెచ్ గురించి పరిశోధనలు మొదలయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటపెడతామని శాస్త్రవేత్తలు అన్నారు.

Related News

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

Big Stories

Advertisement
×