Buy POCO C61 5G Mobile @ 5,999: స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ పోకో తాజాగా కొత్త POCO C61 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. POCO C61 అనేది Airtel ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్. పోకో కంపెనీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో Airtel పోస్ట్‌ప్యాడ్ కనెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనిద్వారా ఫ్రీ డేటా అండ్ మరిన్ని తగ్గిపు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
POCO C61 Airtel ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్ రూ.8,999లకే లాంచ్ అయింది. అయితే దీనిపై వినియోగదారులు ఏకంగా రూ.3000 వరకు డిస్కౌంట్ పొందుతారు. ఈ డిస్కౌంట్‌తో పోకో కొత్త ఫోన్‌ను కేవలం రూ.5,999లకే సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒకే వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్‌ను అందించింది. ఈ కొత్త ఫోన్ జూలై 17 అంటే ఇవాళ్టి నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. దీన్ని Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎథెరియల్ బ్లూ, డైమండ్ బస్ట్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది
Also Read: దూకుడు పెంచిన మోటో.. మళ్లీ భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు!
POCO C61 Airtel ప్రత్యేకత..
POCO C61 స్మార్ట్‌ఫోన్ చౌక ధరలో ఉన్నప్పటికీ.. కంపెనీ ఇందులో అన్ని ప్రత్యేక ఫీచర్లను అందించింది. కస్టమర్లు Airtel కనెక్షన్‌తో ఈ ఫోన్‌ని సొంతం చేసుకుంటారు. ఈ ఫోన్ ఎయిర్‌టెల్ సిమ్‌కు 18 నెలల పాటు లాక్ చేయబడి ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఫోన్‌లో ఎయిర్‌టెల్ సిమ్ మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా 50GB డేటాను కూడా ఉచితంగా కంపెనీ అందిస్తుంది. అలాగే వినియోగదారులకు కంపెనీ దీనిపై రూ.750 తగ్గింపును కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ కార్డు ట్రాన్షక్షన్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధర ఇప్పటికే చాలా తక్కువకే కొనుక్కోవచ్చు.
POCO C61 Specifications
POCO C61 ఫోన్‌లో 1650×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.71 అంగుళాల HD + డిస్‌ప్లేను పొందుతారు. ఇది IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. POCO C61 MediaTek Helio G36 చిప్‌సెట్‌ను పొందుతుంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్‌తో రన్ అవుతుంది. 10 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Also Read: Realme 13 Pro 5G Series: రియల్‌మి నుంచి మరో సిరీస్ రెడీ.. లాంచ్ ఎప్పుడంటే..?
USB టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది. POCO C61లో సేఫ్టీ కోసం సైడ్-ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఆడియో కోసం స్పీకర్‌ను కంపెనీ అందించింది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో డ్యూయల్ సిమ్ 4G, బ్లూటూత్ 5.3, Wi-Fi 5 వంటివి ఉన్నాయి. అలాగే ఇందులో వెనుక వైపు 8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2మెగా పిక్సల్ డెప్త్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాను అందించారు.