BigTV English
Advertisement

Budget Smartphone: బ్రిలియంట్ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్ లాంచ్..ఇవి తెలిస్తే షాక్ అవుతారు..

Budget Smartphone: బ్రిలియంట్ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్ లాంచ్..ఇవి తెలిస్తే షాక్ అవుతారు..

Budget Smartphone: టెక్ ప్రియులకు మరో అద్భుతమైన బడ్జెట్ ఆఫర్ వచ్చేసింది. POCO కంపెనీ తాజాగా POCO C71 స్మార్ట్‌ఫోన్ ను భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లను అందించడమే దీని స్పెషల్. 6.88 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది.


డైలీ యూజ్‌కు
ఇది వినియోగదారుల కళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రిపుల్ TÜV రీన్‌ల్యాండ్ కంటి రక్షణ ధృవీకరణ పొందడం విశేషం. దీని వల్ల ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నా కళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ డైలీ యూజ్‌కు అనుకూలంగా ఉండి, స్టైల్, స్మార్ట్‌నెస్‌ను కల్గి ఉంటుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ వినియోగదారులకు
మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఇది రూ. 5,999 కన్నా తక్కువ ధరకు లభ్యమవుతుంది. అంతే కాకుండా, 50GB అదనపు డేటా బోనస్‌ లభిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్‌ను డెసర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయొచ్చు.


మెరుగైన అనుభూతి కోసం
ఈ ఫోన్‌లో 6.88-అంగుళాల పెద్ద HD+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఇది గేమింగ్, స్క్రోలింగ్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా చేస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి, బయట ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక స్పెషల్ ఏమిటంటే, ఇది ట్రిపుల్ TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ పొందింది. అంటే మీ కళ్లకు ఇది చాలా సేఫ్. లాంగ్ టైమ్ యూజ్ చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు.

పెర్ఫార్మెన్స్‌కు శక్తివంతమైన హార్ట్
Poco C71లో Unisoc T7250 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది పవర్ ఎఫిషియంట్, మల్టీ టాస్కింగ్‌కు సరిగ్గా ఉంటుంది. దీని RAM 6GB వరకు సపోర్ట్ చేస్తుంది. దీనిని వర్చువల్ RAMతో 12GB వరకు విస్తరించవచ్చు. అంటే, ఎక్కువ Apps ఓపెన్ చేసి, గేమింగ్ చేసినా ఫోన్ హ్యాంగ్ అవ్వదు.

ఆన్‌బోర్డ్ స్టోరేజ్
స్టోరేజ్ విషయానికి వస్తే, ఇది 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అదనంగా, microSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఇది బడ్జెట్ ఫోన్‌లో చాలా అరుదుగా కనిపించే ఫీచర్.

సెల్ఫీ ప్రియులకు గుడ్ న్యూస్
ఫోటోలను, వీడియో కాల్స్‌ను ప్రాముఖ్యతనిచ్చే వారికి ఈ ఫోన్ ఓ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెట్ ఉంది:
-32MP ప్రైమరీ కెమెరా
-8MP ఫ్రంట్ కెమెరా
-ఒక బడ్జెట్ ఫోన్‌లో ఈ స్థాయి సెల్ఫీ కెమెరా చాలా అరుదు. వీడియో కాల్స్, రీల్స్, సెల్ఫీలు అన్నిటికీ ఇది సపరేట్‌గా ఇంప్రెషన్ ఇస్తుంది.

పెద్ద బ్యాటరీ, వేగంగా ఛార్జ్
ఈ ఫోన్‌‍లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, రెగ్యులర్ యూజ్‌కు రెండు రోజులు సునాయాసంగా నిలుస్తుంది. ఇందులో 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కువ కాలం పవర్ అవసరమైనప్పుడు ఇది మీకు బెస్ట్ తోడుగా ఉంటుంది.

Read Also: Smartwatch Offer: బడ్జెట్ ధరల్లో ఫాస్ట్రాక్ ప్రీమియం …

భద్రత, కనెక్టివిటీ
Poco C71లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది, ఇది ఫాస్ట్, సెక్యూర్. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే:
-4G VoLTE
-డ్యూయల్-బ్యాండ్ Wi-Fi
-Bluetooth 5.2
-USB టైప్-C పోర్ట్
-3.5mm ఆడియో జాక్
-GPS, FM రేడియో

-ఇవి అన్నీ వినియోగదారుల అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తాయి. IP52 రేటింగ్ ఉండటం వల్ల ఇది నీటి, దుమ్ము కణాలను తట్టుకోగలదు.

అప్‌డేట్ గ్యారెంటీతో
ఈ డివైస్ Android 15 ఆధారితంగా నడుస్తుంది. పోకో సంస్థ చెప్పిన ప్రకారం, దీనికి 2 సంవత్సరాల Android OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ లభిస్తాయి. అంటే, మీరు కొన్న ఫోన్ కేవలం ఇప్పుడు కాదు. వచ్చే నాలుగేళ్లు కూడా సురక్షితంగా ఉండబోతుంది.

ధరలు, లభ్యత
Poco C71‌ను రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు:
-4GB RAM + 64GB స్టోరేజ్ – రూ.6,499
-6GB RAM + 128GB స్టోరేజ్ –రూ.7,499

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×