BigTV English

PM Modi Yunus BIMSTEC: మాటలు జాగ్రత్త!.. బంగ్లాదేశ్ సారథి యూనుస్‌కు మోదీ వార్నింగ్

PM Modi Yunus BIMSTEC: మాటలు జాగ్రత్త!.. బంగ్లాదేశ్ సారథి యూనుస్‌కు మోదీ వార్నింగ్

PM Modi Meets Bangladesh Yunus| బిమ్‌స్టెక్ సదస్సులో భాగంగా థాయ్‌లాండ్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ (PM Modi – Muhammad Yunus) భేటీ అయ్యారు. అయితే ఇటీవల యూనుస్ చైనాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రధాని హెచ్చరించినట్లు సమాచారం.


భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనుస్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు (శుక్రవారం) థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్‌స్టెక్ (BIMSTEC) సమ్మిట్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనుస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనుస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ, ఆ తరహా వ్యాఖ్యలు మంచిది కాదని సుతిమెత్తగా మందలించారు.

‘భారత్‌కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా చెప్పినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాకు తెలిపారు. ‘ప్రజాస్వామ్యయుత, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారతదేశం మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారంతో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించిందని ప్రధాని మోదీ చెప్పినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు.


ఈ స్ఫూర్తితో ఇరు దేశాలు ముందుకు సాగాలని ప్రధాని మోదీ తెలిపారు. ఇటువంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు అనవరసమని మోదీ సూచించారన్నారు. అక్రమంగా బోర్డర్లు దాటడం వంటి ఘటనలకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని, ప్రత్యేకంగా రాత్రి పూట బోర్డర్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందని మహ్మద్ యూనుస్‌కు విజ్ఞప్తి చేశారు మోదీ. బంగ్లాదేశ్‌లో ఉన్న మైనార్టీల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లా చీఫ్ అడ్వైజర్‌ను అడిగినట్లు మిస్రి పేర్కొన్నారు. ప్రధానంగా బంగ్లాలో ఉన్న మైనార్టీల రక్షణ గురించి, వారి హక్కుల గురించి ప్రధాని ఆరా తీశారన్నారు.

Also Read: ఆ దేశం కాజేయాలని దొంగ స్వామిజీ ప్లాన్.. భూ కబ్జా చేయబోయి 20 మంది భక్తులు అరెస్ట్

భారత్ గురించి యూనుస్ ఏమన్నారంటే..

చైనా పర్యటన సమయంలో యూనుస్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర దుమారం రేపాయి. భారతదేశంలో సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని, సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ మాత్రమే ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. చైనాకు ఇది ఒక సువర్ణావకాశమన్నారు. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే యూనుస్ వ్యాఖ్యలపై భారత్‌లో పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ మాటలకే ప్రధాని మోదీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

హసీనా అప్పగింత చర్చకు వచ్చిందా..?

ప్రధాని మోదీతో యూనుస్ భేటీ అయిన సందర్భంగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత గురించి ప్రస్తావన వచ్చిందా..? అని విదేశాంగశాఖను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ… ‘‘షేక్ హసీనా (Sheikh Hasina) విషయమై భారత్‌కు బంగ్లాదేశ్ అధికారిక అభ్యర్థన చేసింది. అయితే ఈ అంశంపై ఇప్పుడు ఇంతకుమించి మాట్లాడటం సరైందికాదు’’అని వెల్లడించారు. అలాగే అక్రమ వలసలు, మైనార్టీలపై దాడుల అంశం వారిద్దరి మధ్య చర్చకు వచ్చింది.

బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ఆందోళనను ప్రధాని మోదీ, యూనస్ దృష్టికి తీసుకెళ్లారని మిస్రి చెప్పారు. గత ఏడాది ఆగస్టులో బంగ్లా తాత్కాలిక సారథ్య బాధ్యతలను యూనస్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. మరోపక్క చైనా, పాకిస్థాన్‌తో ఢాకా దగ్గరవుతోంది. ఈ తరుణంలో ఇరువురు నేతల మధ్య భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పదహారేళ్లపాటు కొనసాగిన షేక్ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన ఉద్యమం కారణంగా పతనమైంది. పదవి కోల్పోయిన ఆమె ప్రాణాపాయం ఉండడంతో స్వదేశాన్ని వీడి మిత్ర దేశమైన భారత్‌ లో శరణం పొందారు. ఆ తర్వాత స్వదేశంలో ఆమెపై అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ దౌత్యకార్యాలయం నుంచి లేఖ అందింది. అయితే అభ్యర్థనపై ఇండియా ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదని ఇటీవల యూనుస్ వెల్లడించారు. ఆమెను తిరిగి రప్పించేందుకు అవసరమైతే అంతర్జాతీయ మద్దతు కోరతామని గతంలో వ్యాఖ్యలు చేశారు.

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×