BigTV English

POCO M6 Pro 5G Price: గింత తక్కువ ధరకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ గల POCO 5G స్మార్ట్‌ఫోనా.. రచ్చలేపుతున్న ఫీచర్లు!

POCO M6 Pro 5G Price: గింత తక్కువ ధరకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ గల POCO 5G స్మార్ట్‌ఫోనా.. రచ్చలేపుతున్న ఫీచర్లు!

POCO M6 Pro 5G Price Dropped: ప్రస్తుతం కాలంలో స్మార్ట్‌ఫోన్లు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇప్పుడొక 5జీ ఫోన్. మరికొందరి దగ్గర అయితే రెండేసి ఫోన్లు కూడా ఉండటం చూశాం. ఇలా ఫోన్లు వాడే వారు ఎక్కువైపోవడంతో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే రిలీజ్ సమయంలో భారీ ధరలతో తీసుకురావడంతో చాలామంది కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలనుకున్నా అధిక ధరల కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు.


అయితే ఇప్పుడు అలాంటి భయమే అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఎండ్‌ ఆఫ్ ది రీజన్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌ జూన్ 1న స్టార్ట్ అయింది. జూన్ 12 వరకు కొనసాగుతుంది. ఇందులో Poco M6 Pro 5g ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లొచ్చు.

Poco M6 Pro 5g ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 4జీబీ/128జీబీ ధర రూ.15,999గా ఉండగా ఇప్పుడు కేవలం రూ.9,499లకే కొనుక్కోవచ్చు. అలాగే 6జీబీ/128జీబీ ధర రూ.16,999 ఉండగా ఇప్పుడు రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. దీని హై అండ్ వేరియంట్ 8జీబీ/256 జీబీ ధర రూ.17,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.14,999లకే లిస్ట్ అయింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మూడు వేరియంట్‌లలో 6/128జీబీ వేరియంట్ బెస్ట్ సెల్లర్‌గా ఉంది. అంటే ఎక్కువ మంది ఫోన్ ప్రియులు దీనిపైనే ఆసక్తి చూపిస్తున్నారన్నమాట.


Also Read: ఈ ఆఫర్లతో 20MP ఫ్రంట్ కెమెరా ఫోన్‌ను వెంటనే కొనేయండి.. డోంట్ మిస్ బ్రదర్..!

ఈ వేరియంట్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.9,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకి రూ.1667 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.10000 లోపు ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే బెస్ట్.

POCO M6 Pro 5G Specifications

POCO M6 Pro 5G ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 90హెర్డ్స్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇది ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది. Snapdragon 4 Gen 2 Processorను కలిగి ఉంటుంది. అలాగే కెమెరా విషయానికొస్తే.. వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో సెల్ఫీల కోసం 8మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×