Chandrababu Carries Ramoji Raos Mortal Remains on His Shoulder at Funeral: ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నిర్మాణం చేయించుకున్న స్మృతి వనం వద్ద అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి ఆయన కొడుకు కిరణ్ నిప్పుపెట్టారు. ఈనాడు గ్రూప్ సిబ్బంది, అభిమానుల మధ్య రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.
రామోజీరావు అంత్యక్రియలు కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రామోజీ నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర సాగింది. ఇందులో పాల్గొన్న చంద్రబాబు, ఆయన పాడి మోశారు.
Also Read: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..
అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఏపీ నుంచి సుజనాచౌదరి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము హాజరయ్యారు.
రామోజీరావు అంతిమ యాత్ర లో పాడె మోసిన చంద్రబాబు#ramojirao #chandrababu #latestnews #restinpeace #bigtv pic.twitter.com/Irlbrr3WTF
— BIG TV Breaking News (@bigtvtelugu) June 9, 2024