BigTV English

POCO M6 Plus 5G Launch: 5జీ రేసులో పోకో.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!

POCO M6 Plus 5G Launch: 5జీ రేసులో పోకో.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!

POCO M6 Plus 5G Launch: మొబైల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న Poco తన కొత్త ఫోన్‌ను రేపు (ఆగస్టు 1) విడుదల చేయనుంది. Poco M6 Plus 5G స్మార్ట్‌ఫోన్‌ను రేపు దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించి ల్యాండింగ్ పేజీ లైవ్ అవుతుంది. దీని ఆధారంగా కొత్త ఫోన్ డిజైన్, కెమెరా సెటప్‌ను చూడొచ్చు. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108MP కెమెరా ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.


బడ్జెట్ 5జీ ఫోన్ రేసులో ఎమ్ సిరీస్ ముందుంది. POCO M6 5G ఫోన్‌ను కేవలం రూ. 8,249తో విడుదల చేసిన తర్వాత కంపెనీ ఇప్పుడు అదే సిరీస్‌లో ‘ప్లస్’ ఫోన్‌ను తీసుకువస్తోంది. Poco M6 Plus 5G రేపు లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్‌ను కంపెనీ వెల్లడించింది. ఇది Poco M6 ఫోన్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టైలిష్ లుక్, ఫీచర్లను చూసి మొబైల్ ప్రియులు ఫిదా అవుతున్నారు.

Also Read: Flipkart iPhone Days Sale 2024: ఆఫర్ల జోరు.. ఐఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. ఇంత తక్కువ ఎలా?


Poco M6 Plus 5G ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో, 1.75 అంగుళాల పెద్ద ఎపర్చర్‌తో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 3x ఇన్-సెన్సార్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో బెటర్ ఫోటోలను క్లిక్ చేయడానికి ఆటో నైట్ మోడ్ ఉంది. ఫోన్ వెనుక కెమెరా సెటప్‌లో రింగ్ ఫ్లాష్ లైట్ ఉంది. ఫోన్ 6.79-అంగుళాల LCD డిస్‌ప్లేతో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 Octacore ప్రాసెసర్‌తో వస్తుంది . ఇది ఆండ్రాయిడ్ 14లో వస్తుంది. అలానే హైపర్ OS పై రన్ అవుతుంది. ఇది 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు కోసం ఇందులో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో 5,030mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.

Also Read: Nothing Phone 2a Plus Launch: తోపు ఫోన్ వచ్చింది.. నథింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. మాములుగా లేదే!

ఈ ఫోన్ IP53 రేటింగ్‌తో వస్తుంది. ఇది 3.5mm జాక్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉంటుంది. నివేదిక ప్రకారం, Poco M6 ప్లస్ 5G ఫోన్ భారతదేశంలో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అవుతుంది. దీని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఈ ఫోన్ 8GB RAM+ 128GB స్టోరేజ్ మోడల్ రూ. 14,999కి లాంచ్ అవుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ మొబైల్ కొనుగోలుపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×