Portable vs party speaker: ఈ రోజుల్లో మ్యూజిక్ వినడానికి బ్లూటూత్ స్పీకర్లు తప్పనిసరిగా మారాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో చిన్న పోర్టబుల్ స్పీకర్ల నుంచి పెద్ద పార్టీ స్పీకర్ల వరకు అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక స్పీకర్ కొనాలనే నిర్ణయం, మీరు దానిని ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారు, మీతో ఎంతమంది ఉంటారు, మీరు ఎలాంటి పార్టీకి హాజరవుతున్నారు అనే అంశాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా మీకు ఏ స్పీకర్ సరిపోతుందో చెప్పొచ్చు. పార్టీ, లేదా ఫంక్షన్ బట్టి ఎలాంటి స్పీకర్ కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోర్టబుల్ స్పీకర్ల పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. మీరు వీటిని పిక్నిక్‌లకు తీసుకువెళ్లొచ్చు, అంతే కాకుండా మీ వర్క్ డెస్క్ దగ్గర కూడా ఉంచుకోవచ్చు. ప్రయాణించేటప్పుడు మీ బ్యాక్‌ప్యాక్‌లో ఈజీగా వేసుకోవచ్చు. లేదా కిచెన్లో పని చేస్తున్నప్పుడు కూడా ఉపయోగించొచ్చు. వీటి చిన్న పరిమాణం, బ్యాటరీ బ్యాకప్, అంతే కాకుండా ఈజీ బ్లూటూత్ కనెక్టివిటీ ఈజీగా వాడటానికి ఉపయోగపడతాయి.ఇదిలా ఉంటే వీటి చిన్న పరిమాణం సౌండ్ అవుట్‌పుట్‌ను పరిమితం చేస్తుంది. చిన్న డ్రైవర్లు బేస్‌ను పరిమితం చేస్తాయి. వాల్యూమ్‌ను మరీ ఎక్కువగా పెంచినప్పుడు స్పష్టత కొంత వరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని పర్సనల్ స్పీకర్‌లుగా ఉపయోగించడం బెస్ట్. ఇవి తక్కువ ధరలోనే లభిస్తాయి. అంతే కాకుండా ఈ మోడల్స్ లో మంచి బేస్ ఇచ్చి మోడల్స్ కూడా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: పాత ల్యాప్ టాప్ అమ్ముతున్నారా? ఇలా చేయకపోతే మీ డేటా లీక్!
పెద్ద ఫంక్షన్ల సమయంలో సాధారణ బ్లూటూత్ స్పీకర్ సరిపోనప్పుడు, పార్టీ స్పీకర్ అవసరం అవుతుంది. పెద్ద డ్రైవర్లు, పవర్ ఫుల్ యాంప్లిఫైయర్‌లతో, ఈ స్పీకర్లు ఎక్కువ సౌండ్, లోతైన బేస్‌ను అందిస్తాయి, దీని వల్ల ఒక పెద్దరూమ్ లో లేదా రూఫ్ టాప్ పార్టీలో ఉండే సౌండ్‌లో కూడా సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. ఇవి బేస్ మ్యూజిక్ ప్లే చేయడమే కాకుండా, మైక్రోఫోన్ ఇన్‌పు ట్, కరోకే మోడ్, ఎల్ఈడీ లైట్లు, ట్రాలీ వీల్స్ వంటి ఫీచర్లతో కూడా వస్తాయి. కాబట్టి ఇవి ఫ్యామలీ గెట్ టుగెదర్ లను మరింత ఆనందంగా మార్చగలవు. కానీ అవి ఎక్కువ బరువుగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.ఎక్కువ వాల్యూమ్‌లో బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయని గుర్తుంచుకోండి. పోర్టబుల్ స్పీకర్ల కంటే ఇవి ఎక్కువ ధర ఉంటాయి. కానీ వీటి బెస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.
వాటి ప్రయోజనాలు ఉద్దేశ్యాన్ని బట్టి స్పీకర్లు మారుతూ ఉంటాయి. మీరు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు మీతో పాటు స్పీకర్‌ను తీసుకెళ్లాలనుకుంటే.. స్థలం గురించి ఇబ్బంది ఉంటే..పోర్టబుల్ స్పీకర్‌ను ఎంచుకోండి. అయితే, మీరు ఇంట్లో తరచుగా పార్టీలుచేసుకోవడం, విశాలమైన ప్రదేశంలో ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే.. స్థలం కూడా ఎక్కువగా ఉంటే.. పార్టీ స్పీకర్‌పై పెట్టుబడి పెట్టడం తెలివైన పని.