E-Paper
Advertisement

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి మంచి డ్రెస్ కావాలా? అబ్బాయిలు, అమ్మాయిల కోసం స్టైలిష్ అవుట్‌ఫిట్స్ చూడండి

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి మంచి డ్రెస్ కావాలా? అబ్బాయిలు, అమ్మాయిల కోసం స్టైలిష్ అవుట్‌ఫిట్స్ చూడండి
Advertisement

Best Outfit Ideas For Wedding| మనకు ఎంతో ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుందంటే ఆ సందడే వేరు. పెళ్లి వేడుకల్లో స్నేహితులతో కలిసి చేసే హంగామా, డ్యాన్స్‌లు, ఫొటోలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే, ఇలాంటి ప్రత్యేక సందర్భంలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లికి ఏ డ్రెస్ వేసుకోవాలనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. అందుకే మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్ ఎంచుకోవాలో తెలుసుకుందాం.

అబ్బాయిల కోసం ఈ 3 రకాల అవుట్‌ఫిట్స్

1. వైట్ కుర్తా సల్వార్‌తో క్లాసిక్ లుక్

సింపుల్‌గా, అదే సమయంలో స్టైలిష్‌గా కనిపించాలనుకునే అబ్బాయిలకు వైట్ కుర్తా సల్వార్ మంచి ఆప్షన్. తెల్లటి పఠానీ సూట్ కూడా ట్రై చేయవచ్చు. దీనికి మ్యాచింగ్ జాకెట్, మొజ్రీ షూస్ జతచేస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. చేతికి మంచి వాచ్ పెట్టుకుంటే సంప్రదాయ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపిస్తారు.

2. త్రీ పీస్ సూట్‌తో రిచ్ లుక్ మీ సొంతం

Advertisement

ఫార్మల్‌గా, రాయల్‌గా కనిపించాలనుకునే వారు త్రీ పీస్ సూట్ ఎంచుకోవచ్చు. నేవీ బ్లూ, బేజ్, చార్కోల్ గ్రే కలర్స్ మంచి ఆప్షన్స్. దీనికి ఫార్మల్ షూస్, మ్యాచింగ్ పాకెట్ స్క్వేర్, స్టైలిష్ వాచ్ జతచేసి అందంగా రెడీ అవ్వవచ్చు.

3. షేర్వానీతో మెరిసిపోయే ట్రెడిషన్నల్ లుక్‌

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో ప్రత్యేకంగా కనిపించాలంటే షేర్వానీ ధరించండి. క్రీమ్, గోల్డెన్, మెరూన్, పాస్టెల్ రంగుల్లో అందమైన డిజైన్లు ఎంచుకోండి. వీటికి చుడీదార్ పైజామా, సంప్రదాయ పాదరక్షలు జతచేయండి. షేర్వానీపై బ్రోచ్ పెట్టుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.
అమ్మాయిలు ఈ మూడు ఫ్యాషన్ అవుట్‌ఫిట్స్ ఎంచుకోవచ్చు.

4. లెహంగాతో గ్రాండ్ లుక్

Advertisement

ట్రెడిష్నల్ డ్రెస్‌లు ఇష్టపడే అమ్మాయిలకు లెహంగా మంచి ఎంపిక. హెవీ ఎంబ్రాయిడరీ లేదా పాస్టెల్ కలర్స్ లెహంగాలు ఎంచుకోండి. మ్యాచింగ్ జ్యువెలరీ, అందమైన హెయిర్‌స్టైల్, ఎంబెల్లిష్డ్ ఫుట్‌వేర్‌తో లుక్ పూర్తి చేయవచ్చు.

5. చీరతో ఎలిగెంట్‌ లుక్

పెళ్లి వేడుకల్లో చీరకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బనారసీ, సిల్క్ లేదా సీక్విన్ వర్క్ చీరలు ట్రై చేయండి. వీటికి స్టేట్‌మెంట్ ఇయర్‌రింగ్స్, గాజులు, అందమైన క్లచ్ జతచేయండి. స్లీక్ బన్ లేదా సాఫ్ట్ కర్ల్స్‌తో అందంగా ముస్తాబవ్వండి.

Also Read: మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్

6. అనార్కలీ సూట్‌తో రాయల్ లుక్

లెహంగా కాకుండా విభిన్నంగా కనిపించాలనుకునే వారు అనార్కలీ సూట్ ట్రై చేయండి. ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీకి హెవీ దుపట్టా, మ్యాచింగ్ జుత్తీలు జతచేయండి. మెహందీ, సంగీత్ వేడుకలకు ఈ అవుట్‌ఫిట్ చక్కగా సరిపోతుంది.

ఫుట్‌వేర్, యాక్సెసరీస్ ఎంపికలోనూ జాగ్రత్త అవసరం

అందమైన దుస్తులతో పాటు సరైన ఫుట్‌వేర్, యాక్సెసరీస్ కూడా ముఖ్యమే. మీ అవుట్‌ఫిట్‌కు సరిపోయే షూస్, జ్యువెలరీ, వాచ్, బ్యాగ్ ఎంచుకోండి. ఎక్కువసేపు వేడుకల్లో గడపాల్సి ఉంటుంది కాబట్టి సౌకర్యవంతమైన దుస్తులు, పాదరక్షలకే ప్రాధాన్యత ఇవ్వండి.

Also Read: మీ చీర అందాన్ని పెంచే 5 లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్లు.. పెళ్లిళ్లకు పర్ఫెక్ట్

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో మీ సొంత స్టైల్‌తో స్పెషల్‌గా కనిపించాలి

మీకు నచ్చిన దుస్తులను ఎంచుకుంటూ సౌకర్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వండి. సరైన రంగులు, యాక్సెసరీస్‌తో మీ లుక్‌ను మరింత అందంగా మార్చుకోవచ్చు. మీ బెస్ట్ ఫ్రెండ్ జీవితంలోని స్పెషల్ డేని స్టైలిష్‌గా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి.

Related News

ఎక్కువ కష్టపడకుండా నడకతోనే వారంలో కిలో బరువు తగ్గించే సింపుల్ ఫార్ములా ఇదే!

ఖరీదైన క్లీనర్లతో పనిలేదు.. ఇంట్లో ఉండే ఈ ఒక్క లిక్విడ్ చాలు, బాత్రూమ్ కొత్తదానిలా మెరిసిపోతుంది!

ఫైబర్ పుష్కలంగా ఉండే స్పెషల్ ఉప్మా.. చలికాలంలో సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌

భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ పని చేస్తే సరి.. బంధం మరింత బలపడుతుంది

పాకెట్ మనీ అస్సలు ఖర్చు పెట్టరు.. ఈ తేదీల్లో జన్మించిన పిల్లలు పుట్టకతోనే ‘ఫైనాన్షియల్ జీనియస్’sr

మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్

చలికాలంలో జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? ఉదయాన్నే టీ తాగే ముందు ఈ స్పైసీ డ్రింక్ తాగండి చాలు

Big Stories

Advertisement
×