E-Paper
Advertisement

పాత ల్యాప్ టాప్ అమ్ముతున్నారా? ఇలా చేయకపోతే మీ డేటా లీక్!

పాత ల్యాప్ టాప్ అమ్ముతున్నారా? ఇలా చేయకపోతే మీ డేటా లీక్!
Advertisement

Laptop Security Threats: ప్రస్తుతం ఆఫీస్ వర్క్, కాలేజీ ప్రాజెక్టులు, కంటెంట్ క్రియేషన్ వంటి వాటి కోసం ల్యాప్ టాప్ అవసరం చాలా వరకు పెరిగింది. ఇలాంటి సమయంలో కొత్తది కొన్నప్పుడు లేదా పాతది అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని అమ్మాలనుకోవడం అందరూ చేసే పనే. అయితే ఇలాంటి సయయంలోనే కొంత మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటంటే.. ఫైల్స్ డిలీట్, రీసైకిల్ బిన్ చేసి ల్యాప్ టాప్ అమ్మేయడం. కానీ సాధారణంగా ల్యాప్ టాప్ లోని ఫైల్స్ డిలీట్ చేయగానే అవి పూర్తిగా పోవు. రికవరీ టూల్స్ వాడితే పాత డేటా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ల్యాప్ టాప్ అమ్మాలనుకున్నప్పుడు తప్పకుండా 3 ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. క్లౌడ్ అకౌంట్స్, లాగ్ అవుట్, పూర్తి బ్యాకప్ వంటి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ల్యాప్ టాప్‌లో ఉన్న ముఖ్యమైన వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్లను ఎక్స్టర్నల్ డ్రైల్‌లోకి లేదా ట్రస్టెడ్ క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవడం మంచిది. అంతే కాకుండా బ్యాకప్ పూర్తి అయిన తర్వాత బ్రౌజర్‌లో అప్పటికే సేవ్ అయిన పాస్ట్ వర్డులు అంతే కాకుండా క్రెడిట్ కార్డ్ వివరాలు, ఆటోఫిల్ డేటాను కూడా తొలగించాలి. అలాగే మైక్రో సాఫ్ట్, సోషల్ మీడియా, గూగుల్, ఆపిల్, మెయిల్ అకౌంట్ల నుంచి లాగ్ అవుట్ అవ్వడం అస్సలు మరిచిపోకూడదు. ఎందుకంటే కొన్ని సార్లు రీసెట్ చేసినా కూడా లింక్ అయిన అకౌంట్లు డివైజ్ మేనేజ్ మెంట్‌లో కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ల్యాప్ ట్యాప్‌ను రిమూవ్ చేయాలి.

Advertisement

2.రెండవది డివైజ్ ఎన్ క్రిప్షన్ ఆన్ చేసి రీసెట్ చేయాలి. ఎందుకంటే లేటెస్ట్ విండోస్‌తో పాటు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో స్టోరేజ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంటుంది, ఇది ఆన్‌లో ఉప్పప్పుడు డ్రైవ్‌లోని డేటా కోడ్ రూపంలో ఉంటుంది. ఫ్యాక్టరీ రీసేట్ చేసేటప్పుడు రిమూవ్ ఎవ్రీథింగ్ ఆప్షన్ లేదా క్లీన్ డ్రైవ్ సెలక్ట్ చేసుకుంటే పాత ఫైల్స్ తిరిగి పొందడం కష్టం అవుతుంది. సింపుల్‌గా క్విక్ రీసెట్ కాకుండా డేటా పూర్తిగా తొలగించే ఆఫ్షన్ ఎంచుకోవడం వల్ల మీ పర్సనల్ డేటా ఫైల్స్ శాశ్వతంగా తొలగిపోతాయి.

3.మూడవది డివైజ్ రిజిస్ట్రేషన్, ఆక్టివేషన్ లాక్స్ తొలగించడం. చాలా మంది ఈ పాయింట్లను అస్సలు పట్టించుకోరు. కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేదా మ్యాక్ అకౌంట్ డివైజ్ లాక్ ఆన్ లో ఉంటే మాత్రం ల్యాప టాప్ కొన్న వ్యక్తికి సెటప్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే రీసెట్ చేయడానికి ముందే డి లింక్ చేసి డివైజ్ రిజిస్ట్రేషన్ తప్పకుండా తొలగించండి. దీని వల్ల మీ ప్రైవసీకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Advertisement

పాత ల్యాప్ టాప్ అమ్మడం ద్వారా కొంత డబ్బు వస్తుంది కానీ అది మన ప్రైవసీ కంటే ఎక్కువ కాదని గుర్తుంచుకోవాలి. ముందుగానే పైన చెప్పిన విధంగా అన్నీ ఫైల్స్, ఫాస్ట్ వర్డ్స్ డిలీట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేదనిపించినప్పుడే ల్యాప్ టాప్ అమ్మడం మంచిది.

Related News

సిమ్ కార్డ్ పోతే ఏం చేయాలి? పాత నంబర్ మారకుండా కొత్త సిమ్ తీసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఇదే!

బంగారం.. ఆభరణంగా ఎప్పుడు, ఎలా మారిందో తెలుసా?

లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తోందా? దీని వెనక ఉన్న పెద్ద మోసం ఇదే!

ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా రావడం లేదా? సెట్టింగ్స్‌లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో నెట్‌వర్క్ ఫుల్!

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా?కారణాలివే!

రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!

ఫోటోలతో స్కామ్‌లు పెరుగుతున్నాయా? క్షణాల్లో ఏఐ ఇమేజ్‌లు గుర్తించండిలా !

Big Stories

Advertisement
×