E-Paper
Advertisement

ఫ్లైట్ మోడ్‌లో..ఫోన్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందా?ఇందులో నిజమెంత?

ఫ్లైట్ మోడ్‌లో..ఫోన్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందా?ఇందులో నిజమెంత?
Advertisement

Fast charge tips: బయటకు వెళ్లే హడావిడిలో ఉన్నా లేదా అర్జెంట్ కాల్స్ చేయాల్సి వచ్చినప్పుడైనా ఫోన్ బ్యాటరీ 10 శాతం కంటే తక్కువగా ఉంటే ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదా.. అయితే అప్పుడే చాలా మంది వెంటనే ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఛార్జింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నిజంగానే ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుందా? లేదా ఇది ఒక మిత్ మాత్రమేనా అని సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ టెక్నాలజీ ప్రకారం ఈ ట్రిక్ వెనక ఉన్న అసలు కారణాలు , ప్రయోగాలు నష్టాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ చేయడం వల్ల కొంతవరకు వేగంగానే ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్, వంటి రేడియో కనెక్షన్లు ఆగిపోతాయి. అంతే కాకుండా సిగ్నల్ వీక్‌గా ఉన్న ఏరియాలో ఫోన్ టవర్ కోసం సెర్చ్ చేస్తూ చాలా పవర్ లాగుతుంది. ఇలాంటి సమయంలో ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ చేస్తే ఆ బ్యాక్‌గ్రౌండ్ పవర్ వాడకం చాలా వరకు తగ్గుతుంది. దీంతో ఛార్జర్ నుంచి వచ్చే కరెంట్‌లో ఎక్కువ భాగం బ్యాటరీ నిండటానికే వెళ్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే..లేటెస్ట్ ఫాస్ట్-ఛార్జింగ్ స్మార్ట్‌ ఫోన్లలో మాత్రం ఈ తేడా చాలా తక్కువగా ఉంటుందని గమనించాలి. ఎందుకంటే లేటెస్ట్ ఫోన్లు, స్మార్ట్ ఛార్జింగ్ అడాప్టర్లు బ్యాటరీ సేఫ్టీ కోసం పవర్ ఫ్లోను కంట్రోల్ చేస్తూ.. వేగంగా ఛార్జ్ చేస్తాయి. అయినా సరే.. స్క్రీన్ ఆఫ్ చేసి, ఇతర యాప్స్ వాడకుండా.. ఉంటే ఫ్లైట్ మోడ్ వల్ల కొంత వేగం పెరుగుతుందని చెప్పొచ్చు.

ప్రయోజనాలు:

ఫ్లైట్ మోడ్ లో ఉంచి ఫోన్ ఛార్జింగ్ చేయడం వల్ల స్పీడ్ కొంచెం పెరగుతుంది, ముఖ్యంగా వీక్ నెట్‌వర్క్ ఏరియాలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండోది, ఛార్జింగ్ అవుతున్నప్పుడు అనవసర కాల్స్,నోటిఫికేషన్లు, మెసేజ్‌లు రాకపోవడం వల్ల మనకు డిస్ట్రబెన్స్ అస్సలు ఉండదు. ఫలితంగా ఫోన్ కూడా అనవసరంగా వేడెక్కదు. మూడోది, బ్యాటరీ హెల్త్‌పై కూడా చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది.

Advertisement

Also Read: పాత ల్యాప్ టాప్ అమ్ముతున్నారా? ఇలా చేయకపోతే మీ డేటా లీక్!

నష్టాలు:

ఫ్లైడ్ మోడ్ ఆన్ చేయడం వల్ల అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే.. కనెక్టివిటీ మిస్ అవ్వడం. ఫ్లైట్ మోడ్‌లో.. ఉన్నప్పుడు ఫోన్‌కు కాల్స్ రావు, అంతే కాకుండా ఎస్‌ఎంఎస్‌లు రావు, వాట్సాప్ మెసేజ్‌లు కూడా అందవు.ఇలాంటి సమయంలో అర్జెంట్ కాల్ లేదా మెసేజ్ వస్తుందేమోనని మనం మళ్లీ మళ్లీ ఫోన్ చెక్ చేయాల్సి వస్తుంది. అలాగే స్మార్ట్‌ వాచ్ లేదా ఇయర్‌ బడ్స్ కనెక్ట్ చేసి ఉంటే.. అవి కూడా వెంటనే డిస్‌కనెక్ట్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఫ్లైట్ మోడ్ వేసి ఛార్జ్ అయ్యాక మళ్లీ ఆఫ్ చేయడం మర్చిపోతే.. చాలా సేపు ఫోన్ ఆఫ్‌లైన్‌లోనే ఉండి పోతుంది.

అందుకే.. ఫ్లైట్ మోడ్ అనేది ఒక మ్యాజిక్ బటన్ కాదు కానీ, అత్యవసర సమయాల్లో.. ఉపయోగపడే స్మార్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు లేదా త్వరగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. మీరు ఫోన్ ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టడం మంచిదే. కానీ.. తరచూ అదే అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ ఛార్జర్ వాడటం, ఫోన్ వేడెక్కకుండా.. చూసుకోవడం వల్ల కూడా ఛార్జింగ్ త్వరగా నిండుతుంది.

Related News

ఫోటోలు డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ చూపిస్తోందా?ఈ హిడెన్ ఫీచర్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

పాత ల్యాప్ టాప్ అమ్ముతున్నారా? ఇలా చేయకపోతే మీ డేటా లీక్!

సిమ్ కార్డ్ పోతే ఏం చేయాలి? పాత నంబర్ మారకుండా కొత్త సిమ్ తీసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఇదే!

బంగారం.. ఆభరణంగా ఎప్పుడు, ఎలా మారిందో తెలుసా?

లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తోందా? దీని వెనక ఉన్న పెద్ద మోసం ఇదే!

ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా రావడం లేదా? సెట్టింగ్స్‌లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో నెట్‌వర్క్ ఫుల్!

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా?కారణాలివే!

Big Stories

Advertisement
×