How to clear internal storage: ఫోన్‌లో హై క్వాలిటీ ఫోటోలు, బోలెడ్ రీల్స్, వీడియోలు తీసే.. చాలా మందికి స్టోరేజ్ ఫుల్ అనే నోటిఫికేషన్ పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి టైంలో.. డజన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు డిలీట్ చేసినా కూడా కొన్ని సార్లు ఫోన్‌లో ఒక్క ఎంబీ కూడా స్పేస్ పెరగకపోతే..ఎవ్వరికైనా చిరాకు వస్తుంది. అయితే చాలా మంది ఇది ఫోన్ ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ అసలు కారణం మాత్రం వేరే ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్ డేట్‌లలో వచ్చిన స్టార్ట్ స్టోరేజ్ మేనేజ్ మెంట్ ఫీచర్లను సరిగ్గా వాడితే.. నిమిషాల్లో జీబీల కొద్దీ స్పేస్ ఈజీగా ఖాళీ చేసుకోవచ్చు. అదెలాగొ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సమస్యకు ప్రధాన కారణం ట్రాప్ లేదా రీసైకిల్ బిన్ ఫీచర్ అని చెప్పొచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ సిస్టమ్ , గూగుగ్ ఫోటోల అప్ డేట్ ప్రకారం మీరు ఏదైనా వీడియో లేదా ఫోటో డిలీట్ చేసినప్పుడు అది వెంటనే పూర్తిగా పోదని చెప్పొచ్చు. పొర పాటున డిలీట్ చేస్తే.. మాత్రం మళ్లీ తెచ్చుకోవడానికి వీలుగా 30 రోజుల పాటే ట్రాష్ ఫోల్డర్ లో దాగి ఉంటుంది. అయితే.. ఆ ఫైల్స్ అక్కడే ఉంటాయి కాబట్టి, మీ ఫోన్ స్టోరేజ్ అప్పటికే నిండినట్లు చూపిస్తుంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక కొత్త యాప్స్ ఇన్ స్టాన్ చేయలేక అంతే కాకుండా కెమెరా ఓపెన్ చేయలేక కూడా ఇబ్బంది పడుతుంటారు.