E-Paper
Advertisement

బంగారం.. ఆభరణంగా ఎప్పుడు, ఎలా మారిందో తెలుసా?

బంగారం.. ఆభరణంగా ఎప్పుడు, ఎలా మారిందో తెలుసా?
Advertisement

డబ్బు తర్వాత ప్రజలు దేనికైనా అధిక ప్రాధాన్యం ఇచ్చే విలువైనది ఏదైనా ఉందంటే.. అది బంగారమే. దీని విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. కానీ, ఎప్పటికీ తగ్గదు. అయితే.. ఆరేడు నెలల కిందట బంగారం చాలా ప్రియంగా ఉండేది. దాన్ని కొనడానికి కూడా జనం భయపడ్డారు. అయితే, ఇప్పుడు క్రమేనా తగ్గుముఖం పడుతూ.. మరోసారి పసిడి ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అది సరే.. అసలు బంగారం ఎలా పుట్టింది? కాలక్రమేనా అది ఆభరణంగా, విలాస వస్తువుగా ఎలా మారింది?

ఏ కార్యమైనా.. బంగారం ఉండాల్సిందే

లోహాల్లో మీకు ఏది ఇష్టం అని అడిగితే.. ఎక్కువ మంది బంగారం అనే చెబుతారు. ముఖ్యంగా భారతీయులు.. బంగారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లిల్లు, పండుగలు, పుట్టిన రోజులు.. ఇలా ఎన్నో సందర్భాల్లో బంగారు ఆభరణాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు మనుషులు బంగారు ఆభరాణాలను ధరించడం ఎప్పుడు ప్రారంభించారు? వేల సంవత్సరాల క్రితం బంగారాన్ని ఎలా ఉపయోగించేవారు? ఆభరణంగానే కాకుండా సంపదకు చిహ్నంగా ఎలా మారింది? వీటికి సమాధానం తెలియాలంటే.. ఒకసారి చరిత్రలోకి తొంగి చూడాల్సిందే.

బంగారం ఆభరణంగా ఎప్పుడు మారింది?

Advertisement

బంగారం ప్రకృతిలో భాగం. ఇతర లోహాల తరహాల్లోనే దాన్ని భూమి నుంచి తవ్వి తీయాలి. దీనికి పెద్దగా శుద్ధి ప్రక్రియ అవసరం లేదు. ఇది చాలా ఫ్లెక్సిబుల్‌గా, మెత్తగా ఉండటం వల్ల ఈజీగా వివిధ ఆకారాల్లోకి మార్చేయొచ్చు. అందుకే ప్రాచీన మానవులకు.. బంగారంతో వస్తువులు తయారు చేయడం సులభమైంది. మొదట్లో బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పూసలు, లాకెట్లు, ఇతర అలంకరణ వస్తువులను తయారు చేసేవారు. ఆ తర్వాతే లోహాన్ని పలుచగా చేసి వంచడం, రకరకాల ఆకారాల్లో మలచడం వంటి నైపుణ్యులు తెలుసుకున్నారు.

అలంకరణకు బంగారమే ఎందుకు?

అన్ని లోహాలు ఉండగా.. బంగారాన్నే ఎందుకు ధరించాలని అనుకున్నారనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే, బంగారం ఇతర లోహాల కంటే చాలా భిన్నమైనది. దీని మెరుపు ఎక్కువ కాలం నిలుస్తుంది. తప్పు పట్టదు. నచ్చిన డిజైన్‌లోకి మార్చుకోవచ్చు. అందుకే, వేల ఏళ్ల కిందటే దీన్ని ప్రత్యేకతను గుర్తించి ఆభరణాలుగా ధరించడం మొదలుపెట్టారు. అయితే, బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. దాన్ని తవ్వి, వెలికి తీసి.. ఇతర లోహాల నుంచి సెపరేట్ చేయగలిగితేనే బంగారం తయారవుతుంది. అందుకే, దానికి కాలక్రమేనా విలువ పెరుగుతూ వచ్చింది. జనాలకు అలంకరణపై ఆసక్తి పెరిగిన నాటి నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం మరింత ప్రియంగా మారింది.

బంగారం ఎప్పటి నుంచి వాడకంలో ఉంది?

Advertisement

బంగారు ఆభరణాల చరిత్ర ఇప్పటిది కాదు. సుమారు 6,500 సంవత్సరాల కిందట నుంచి బంగారు ఆభరణాలు చెలామణిలో ఉన్నాయి. పురావస్తు ఆధారాల ప్రకారం.. బల్గేరియాలోని వర్ణా ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బంగారు వస్తువులు బయటపడ్డాయి. ఇవి క్రీ.పూ.4600 నుంచి 4300 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవిగా పరిశోధకులు అంచనా వేశారు. 1976లో జరిపిన తవ్వకాల్లో ఒక పురాతన శ్మశానం ఒకటి బయటపడింది. అక్కడ ఉన్న వందలాది సమాధుల్లో బంగారం పూసలు, కంకణాలు, లాకెట్లు వంటి ఇతర బంగారు అలంకరణ వస్తువులు లభించాయి. సుమారు 3 వేలకు పైగా బంగారు వస్తువులు బయటపడ్డాయి. వాటి మొత్తం బరువు ఆరు కేజీలకు పైగా ఉండటం గమనార్హం.

బంగారమంటే స్టేటస్

ఆ రోజుల నుంచే ప్రజలు బంగారాన్ని ఒక స్టేటస్‌గా భావించేవారని ఆధారాలను చూస్తే అర్థమవుతుంది. కొన్ని సమాధుల్లో భారీ మొత్తంలో బంగారం లభించడం, కొన్ని సమాధుల్లో అసలు బంగారం లేకపోవడం వంటివి అప్పటి సమాజంలో ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు ఉండేవని చెప్పడానికి నిదర్శనం.

ఈజీప్టు.. బంగారుమయం

ప్రాచీన ఈజిప్టు నాగరికతలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉండేది. అక్కడి రాజులు, రాణులు బంగారు కిరీటాలు, నగలు, కంకణాలు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించేవారు. ఈజిప్టియన్లు బంగారాన్ని దైవ పదార్థంగా భావించేవారు. అందుకే రాజుల సమాధుల్లో కూడా బంగారు వస్తువులు ఉంచేవారు. మమ్మీల అంత్యక్రియల్లో కూడా బంగారు ముసుగులు, ఆభరణాలు వాడేవారు. క్రీ.పూ.3000 నాటికి ఈజిప్టులో బంగారు ఆభరణాల తయారీలో అత్యద్భుత నైపుణ్యం కనిపించింది. బంగారంతోపాటు విలువైన రాళ్లను నగల్లో పెట్టి డిజైన్ చేసేవారు.

ఇండియాలోనూ అంతే..

మన దేశానికి కూడా బంగారు ఆభరణాలతో విడదీయలేని అనుబంధం ఉంది. సింధూ లోయ నాగరికత కాలంలోనే ప్రజలు బంగారం, వెండి, రాగి వంటి లోహాలతో అలంకరణ వస్తువులను తయారు చేసేవారు. మెడలో పూసలు దండలు, నెక్లెస్‌లు, కంకణాలు, చెవిపోగులను అందంగా అలంకరించుకొనేవారు. అయితే, అప్పటి వరకు బంగారం అనేది అలంకరణ వస్తువు మాత్రమే. ఇప్పుడు మనం ధరించే పూసల దండలు లెక్క. అయితే, ఇప్పుడు బంగారం పెట్టుబడిగా మారిపోయింది. అలంకరణ కోసం కాకుండా.. భవిష్యత్తులో కష్టాల నుంచి గట్టెక్కించే పెట్టుబడి వస్తువుగా జనాలు భావిస్తున్నారు. చాలామంది భారతీయులు తమ ఇళ్లల్లోని బంగారాన్ని అమ్మడానికి ఇష్టపడరు. తరతరాలుగా తమ కుటుంబికుల నుంచి సంప్రదాయంగా వస్తున్న నగలను వారసత్వంగా పంచడం ఆనవాయితీగా సాగుతోంది.

బంగారు నాణేల చెలామణి

ప్రాచీన కాలంలో బంగారం అరుదుగా లభించే లోహం. అప్పట్లో రాజులు.. ఎప్పుడైనా ప్రజల నుంచి లేదా వాణిజ్యవేత్తల నుంచి ఏమైనా తీసుకోవాలంటే.. వారి వద్ద ఉండే బంగారాన్ని ఇచ్చేవారు. ముఖ్యంగా వారి వద్ద ఉండే ఆభరణాలు ఇచ్చేవారు. దాన్ని మరింత సులభతరం చేసేందుకు బంగారు నాణేలను ప్రవేశపెట్టారు. వస్తువులకు విలువ కట్టి ఎన్ని బంగారు ఆభరణాలు అంటే అన్ని ఇచ్చేవారు. చెప్పాలంటే.. అప్పటి నుంచే బంగారాన్ని సంపదలో భాగం చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఉన్న కరెన్సీ కి బాప్.. మన ‘బంగారమే’.

అసలు బంగారం భూమిపైనే పుట్టలేదట!

బంగారం అనేది అసలు భూమి సొత్తే కాదట. బంగారం అణువులు భూమి ఏర్పడక ముందే విశ్వంలో పుట్టాయి. దాదాపు 13.8 బిలియన్ ఏళ్ల కిందట బిగ్ బ్యాంక్ జరిగినప్పుడు విశ్వంలో ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వంటి తేలికపాటి మూలకాలు ఏర్పడ్డాయి. కానీ, బంగారం వంటి భారమైన మూలకాలేవీ ఏర్పడలేదు. ఆ తర్వాత విశ్వంలో నక్షత్రాలు ఏర్పడ్డాయి. వాటి లోపల అణు చర్యలు వల్ల కార్బన్, ఆక్సిజన్, ఐరన్ వంటి మూలకాలు తయారయ్యాయి. అవి పరస్పరం ఢీకొనడం వల్ల బంగారం పుట్టింది.

Also Read: రూ.55 వేలకు బంగారం ఢమాల్.. 11 నెలల్లో ఇంత మార్పా? 1981 మళ్లీ రిపీట్?

సుమారు 4.6 బిలియన్ ఏళ్ల కిందట అంతరిక్షంలోని దూళి, వాయువుల మేఘం క్రమం కుదించుకుపోయి సూర్యుడిని, గ్రహాలను ఏర్పరిచింది. భూమి ప్రారంభంలో చాలా వేడిగా, కరిగిన స్థితిలో ఉన్నప్పుడు బంగారం వంటి భారీ లోహాలు భూమి లోపలి కేంద్ర వైపు వెళ్లింది. కొంత బంగారం మాత్రం భూమి పై పొరల్లో మిగిలిపోయింది. అయితే, భూమిపై బంగారాన్ని మొదటి కనుగొన్న వ్యక్తి ఎవరు అనే విషయానికి మాత్రం ఇప్పటికీ ఆధారాలు లేవు. కానీ, భూమి పై పొరల్లోని బంగారం మట్టి, రాళ్ల రూపంలో నదుల ద్వారా కొట్టుకొచ్చినప్పుడు జనాలు వాటిని మొదట్లో వస్తువులుగా మార్చే ప్రయత్నాం చేసి ఉంటారని, క్రమేనా ఆ లోహానికి ఉండే ఆకర్షణ, మెరుపు, ఫ్లెక్సిబిలిటీ వల్ల ఆభరణాలుగా తయారు చేసి వాడటం మొదలుపెట్టి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Tags

Related News

లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తోందా? దీని వెనక ఉన్న పెద్ద మోసం ఇదే!

ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా రావడం లేదా? సెట్టింగ్స్‌లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో నెట్‌వర్క్ ఫుల్!

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా?కారణాలివే!

రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!

ఫోటోలతో స్కామ్‌లు పెరుగుతున్నాయా? క్షణాల్లో ఏఐ ఇమేజ్‌లు గుర్తించండిలా !

యాపిల్, శాంసంగ్‌లకు చెక్ పెట్టబోతున్న OpenAI.. త్వరలోనే యాప్స్ లేని కొత్త స్మార్ట్‌ఫోన్!

జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.450 రీఛార్జ్‌తో ఫ్రీ జియో హాట్‌స్టార్, ఏడాది పాటు కాన్వా ప్రో లైట్!

Big Stories

Advertisement
×