Big Stories

Case on Amazon Alexa: అమెజాన్‌పై ప్రైవసీ కేసు.. అలెక్సానే కారణం..

Case on Amazon Alexa: టెక్నాలజీ అనేది పెరుగుతోంది. దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్‌లో ప్రైవసీ అనేదే కరువయ్యింది. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని దేశ ప్రభుత్వాలు సైతం ముందుకొస్తున్నాయి. తాజాగా అమెజాన్.. పిల్లల ప్రైవసీకి భంగం కలిగించిందని కోర్టులో కేసు కూడా నమోదయ్యింది.

- Advertisement -

అమెజాన్.. అలెక్సా అనే ఒక వాయిస్ అసిస్టెంట్‌ను తన యూజర్లకు అందించింది. ఈ వాయిస్ అసిస్టెంట్ మనం చెప్పింది చేయడం మాత్రమే కాకుండా అన్నీ శ్రద్ధగా వింటుంది కూడా. ముఖ్యంగా పిల్లలను ఈ వాయిస్ అసిస్టెంట్‌ ఎంతగానో ఆకర్షించింది. అందుకే వారు అలెక్సాతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డారు. అలా ముగ్గురు పిల్లలకు సంబంధించిన సమాచారానికి భంగం కలిగించిందని అమెజాన్‌పై ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌ (ఎఫ్‌టీసీ)లో కేసు నమోదయ్యింది.

- Advertisement -

ఇప్పటికే ప్రైవసీకి భంగం కలిగించిన విషయంలో అమెజాన్‌ను ఎన్నో ఏళ్లుగా ఎఫ్‌టీసీ విచారిస్తూనే ఉంది. చిల్డ్రన్స్ ఆన్‌లైన్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో కూడా అమెజాన్‌పై కేసులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి అమెజాన్‌కు తీవ్ర పెనాల్టి పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల విషయంలోనే ఇలా జరుగుతుందని ఎఫ్‌టీసీ తెలిపింది. ఈ కేసు విషయంలో ముందడుగు వేయాలంటే ఎఫ్‌టీసీ.. జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది.

ముందుగా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించిన తర్వాత.. ఆ డిపార్ట్‌మెంట్ స్పందించడానికి 45 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ అప్పటికీ డిపార్ట్‌మెంట్ స్పందించకపోతే.. ఎఫ్‌టీసీ తనంతట తానుగా యాక్షన్ తీసుకోవచ్చు. ఈ కేసు గురించి మీడియా అడిగినప్పుడు ఎఫ్‌టీసీ ఛీఫ్ స్పందించడానికి ఇష్టపడలేదు. అందుకే ఈ కేసును ఎఫ్‌టీసీ ఎలా డీల్ చేస్తుందో అని ప్రజలకు అనుమానాలు మొదలయ్యాయి. పిల్లలు అలెక్సా ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి కానీ, లేదా వారి ప్రమేయం కానీ ఉండాలని అమెజాన్ ఇదివరకే తెలిపింది. ఇప్పుడు అదే పాయింట్‌తో కేసును నడిపించాలని అమెజాన్ చూస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News