Big Stories

Bandi Sanjay: అంతా బండి సంజయే చేశారు.. ఆయన ఫోన్‌లో సంచలన విషయాలు.. సీపీ ప్రెస్‌మీట్

bandi sanjay cp ranganath

Bandi Sanjay: “అంతా బండి సంజయే చేశారు.. పరీక్షలు రద్దు అయ్యేలా కుట్ర చేశారు.. బండి సంజయ్ ఫోన్‌ ఇస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి.. ఫోన్ అడిగితే లేదన్నారు.. అయినా, వేరే మార్గాల్లో సంజయ్ ఫోన్ డేటా రికవరీ చేస్తాం”.. ఇలా సాగింది టెన్త్ పేపర్ లీక్ కేసులో వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్.

- Advertisement -

పేపర్ లీక్‌ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరు చేర్చామని.. ఏ2గా మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ ఉన్నారని చెప్పారు. కేవలం బండి సంజయ్‌కి మెసేజ్ వచ్చినందుకే ఆయనపై కేసు పెట్టలేదని.. ఎగ్జామ్‌కు ముందురోజే ఏ2 ప్రశాంత్‌తో బండి సంజయ్ చాటింగ్, వాట్సాప్ కాల్స్ మాట్లాడారని అన్నారు సీపీ రంగనాథ్.

- Advertisement -

పోలీసులు అడిగితే.. బండి సంజయ్ ఫోన్ లేదని చెప్పారని.. ఆయన ఫోన్ ఇస్తే ఇంకా అనేక విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. బండి సంజయ్ ఫోన్ ఇవ్వకున్నా ఆయన ఫోన్ డేటా రికవరీ చేస్తామని చెప్పారు.

చాలామంది బీజేపీ నేతలకు ఏ2 ప్రశాంత్ పేపర్ పంపించాడని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు, ఆయన పీఏకూ పేపర్ పంపించాడని.. ఇలా పేపర్ వచ్చిన అందరినీ అరెస్ట్ చేయలేదని.. సీపీ స్పష్టం చేశారు. తమకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా ఉండదన్నారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పాత్ర ఉందని నిర్థారించుకున్నాకే ఆయన్ను అరెస్ట్ చేశామని చెప్పారు.

ఏ2 ప్రశాంత్ బీజేపీ గ్రూపులో యాక్టివ్‌గా ఉన్నారని పీపీ రంగనాథ్ అన్నారు. విద్యార్థుల్లో అయోమయం క్రియేట్ చేసేందుకే కుట్ర చేశారని.. పక్కా ముందస్తు ప్రణాళిక మేరకే పేపర్ లీక్ చేశారని.. పరీక్షలు రద్దు అయ్యేలా చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేశారన్నారు సీపీ.

ఇక బండి సంజయ్‌ను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారనే ఆరోపణలపైనా వివరణ ఇచ్చారు పోలీస్ కమిషనర్. 41 crpc ప్రకారం.. వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయవచ్చని చెప్పారు. ప్రొసీజర్ ప్రకారమే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశామని.. లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. బండి సంజయ్ ఫోన్ డేటా రికవరీ చేస్తే.. మరింత పూర్తి సమాచారం వస్తుందని అన్నారు కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న వరంగల్ సీపీ రంగనాథ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News