Public Wi-Fi : డిజిటల్ యుగంలో వైఫై ప్రతి చోటా అవసరమయ్యే విషయమే. ఇంట్లో వైఫై అయితే ఎలా ఉపయోగించుకున్నా ఇబ్బంది లేదు కానీ బయట వైఫై ఉపయోగించినప్పుడు కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ ఎప్పటికీ సురక్షితం కావానే విషయం గుర్తుంచుకోవాలి. వీటిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొని పనిచేస్తూ ఉంటారు. ఇందులో డేటాను హ్యాక్ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పబ్లిక్ ఏరియాలో వైఫై ఉపయోగించి పాస్వర్డ్, క్రెడిట్ కార్డు వంటి వివరాలను ఇచ్చినప్పుడు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్ లావాదేవీలు జరిపించినప్పుడు ఎకౌంట్లో డబ్బులు సైతం మాయమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడైనా వైఫై ఉపయోగించాల్సి ఉంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) –
పబ్లిక్ ఏరియాలో వైఫై ను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ను ఉపయోగించాలి. ఇది ఇంటర్నెట్ ట్రాఫిక్ ను నిరోధిస్తుంది. హ్యాకర్లు డేటాను యాక్సెస్ చేయడానికి కష్టతరం చేస్తుంది. సురక్షితమైన నెట్వర్క్ ద్వారా వైఫై కనెక్ట్ చేసినప్పుడు VPN మీ ఐపీ అడ్రస్ ను కనిపించకుండా చేస్తుంది. పబ్లిక్ ప్లేస్ లో వైఫై ని ఉపయోగించినప్పుడు అదనపు భద్రతను ఇది జోడిస్తుంది. నమ్మకమైన VPN సేవలు అందుబాటులో ఉన్నాయేమో గుర్తించాలి. వీటిని మాత్రమే ఉపయోగించాలి.
టూ స్టెప్ వెరిఫికేషన్ (2FA) –
టు ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ద్వారా వైఫై ని ఉపయోగిస్తే అదనపు భద్రత ఉంటుందని గుర్తించాలి. ఎవరైనా పాస్వర్డ్ ను తెలుసుకున్నప్పటికీ.. ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ లో ఖాతాను యాక్సెస్ చేయడం కష్టతరంగా మారుతుంది. పబ్లిక్ ప్లేస్ లో వైఫై ఉపయోగించినప్పుడు ఈ విధానం సరైనది.
నిజానికి పబ్లిక్ ప్లేస్ లో వైఫై ని ఉపయోగించినప్పుడు బ్యాంకింగ్ వివరాలు లేదా వ్యక్తిగత ఈ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వంటివి ఇవ్వడాన్ని ఆపేయటం మంచిది. అవసరమైతే అటువంటి వాటికోసం పబ్లిక్ వైఫై కి బదులు మొబైల్ డేటాను ఉపయోగించాలి. సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ లో ఉంచుతూ రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో హ్యాకర్లు దోపిడీ చేసే విధానానికి ముగింపు పలకాలి. వైఫై నెట్వర్క్ లకు కనెక్ట్ చేయడానికి ముందు ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అప్లికేషన్ సైతం జాగ్రత్తగా ఉంచాలని గుర్తించాలి. ఇక ఫైల్ షేరింగ్ తో పాటు డేటా బదిలి వంటివి పబ్లిక్ వైఫైతో చేయకపోవడం మంచిది.
HTTPS వెబ్‌సైట్స్ –
హాట్ స్పాట్ ను కనెక్ట్ చేయడం వల్ల డేటా చోరి జరిగే అవకాశాలను తగ్గించుకోవాలి. అంటే HTTPS వెబ్‌సైట్‌లను ఉపయోగించడం మంచిది. పబ్లిక్ వైఫైలో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఉపయోగించే వెబ్సైట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సైట్స్ బ్రౌజింగ్ డేటాను ఇన్స్క్రిప్ట్ చేస్తాయి. డేటా వేరేవారికి మొదటి కాకుండా మదనపురక్షణ అని జోడిస్తాయి ఇక ఏది ఏమైనా తప్పు చేస్తా వైఫైను ఉపయోగించడం అంత సురక్షితం కాదని విషయాన్ని గుర్తించుకోవాలి. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాడటం మంచిది