E-Paper
Advertisement

Murder Mystery OTT : ఒకే ప్లేసులో వరుస హత్యలు.. తమ్ముడిని హత్య చేసిన కిల్లర్ ను అన్న ఎలా పట్టుకున్నాడు..?

Murder Mystery OTT : ఒకే ప్లేసులో వరుస హత్యలు.. తమ్ముడిని హత్య చేసిన కిల్లర్ ను అన్న ఎలా పట్టుకున్నాడు..?
Advertisement

Murder Mystery OTT : ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తుంటాయి.. థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలోకి కొత్త సినిమాలతో పాటుగా థ్రిల్లర్ యాక్షన్ మూవీలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు ఓటీటీ సంస్థలు. తాజాగా మరో మర్డర్ మిస్టరి సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

స్టార్ మా లో ప్రసారం అయిన గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో మెప్పించిన జ్యోతి రాయ్ ఈ మూవీలో లీడింగ్ రోల్ లో నటించింది. ఇదొక కన్నడ మూవీ.. నైట్ రోడ్ ఓటీటీలోకి రాబోతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కన ఈ మూవీకి గోపాల్ దర్శకత్వం వహించాడు.. వరుస హత్యలను ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అసలు ఒకే ప్లేసులో హత్యలు చెయ్యడం ఏంటి అనే సస్పెన్స్ సినిమా ఇది. ఈ మూవీ మొత్తం సస్పెన్ థ్రిల్లర్ మూవీగా ఇది ఉండబోతుంది..

Advertisement

మనం చేసుకున్న ఖర్మ ఫలమే మన జీవితాన్ని శాసిస్తుంది అని ఈ మూవీలో చూపించారు. నైట్ రోడ్ టైటిల్ కు తగ్గట్లు అంతులేని సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలతో మూవీని దర్శకుడు చూపించారు. ఈ మూవీలో జ్యోతి రాయ్ పాజిటివ్ రోల్ లో కనిపించే నెగిటివ్ షేడ్ లో కనిపించింది. ఓ రోడ్ యాక్సిడెంట్ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడనే పాయింట్‌తో చివరి వరకు దర్శకుడు ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించాడు. సెప్టెంబర్ నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఓ పోలీస్ ఆఫీసర్ తమ్ముడు డ్రగ్స్ కు అలవాటు పడి ఉంటాడు. ఆ మత్తులో అతను ఏం చేస్తున్నాడన్నది ఎవరికీ తెలియదు. ఇక ఓ అమ్మాయిని శారీరకంగా హింసించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడంతో పారిపోతాడు. రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అతన్ని ఏ వాహనం గుద్దింది అనేది మాత్రం అక్కడ అనవాలు కనిపించవు. అదే ప్లేస్‌లో అంతకుముందు అతని స్నేహితుడు సూరప్ప కూడా చనిపోయినట్లుగా దీక్ష ఇన్వేస్టిగేషన్‌లో బయటపడుతుంది. ఈ రెండు హత్యలకు ఆ ప్లేస్‌కు ఉన్న సంబంధమేమిటి? నిజంగానే కళ్యాణ్ యాక్సిడెంట్‌ లో చనిపోయాడా? అతడిని ఎవరైనా హత్యచేశారా? తమ్ముడి చావుకు కారణమైన వారిని ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకుంటాడు అనేది స్టోరీ.. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా చంపాలని అనుకుంటారు. ఇక ఎన్నో సవాళ్ళను అధిగమించి అసలు హంతకులను పట్టుకుంటారు. ఎన్నో ట్విస్ట్ లతో ఈ మూవీ స్టోరీ ఉంటుంది.

Advertisement

హీరోయిన్ జ్యోతి రాయ్ ఒకప్పుడు వరుసగా సీరియల్స్ లలో నటించింది. ఇప్పుడు మాత్రం కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హాట్ అందాలతో కుర్రకారకు పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది.. మరో రెండు ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Tags

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×