BigTV English

Crime Thriller Movie In OTT : సస్పెన్స్ లతో క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ.. హత్య చుట్టు తిరిగిన మిస్టరీ..

Crime Thriller Movie In OTT : సస్పెన్స్ లతో క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ.. హత్య చుట్టు తిరిగిన మిస్టరీ..

Crime Thriller Movie In OTT : ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలను అందిస్తుంది.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సస్పెన్స్ మూవీలను అందిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి మూవీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. తాజాగా మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఒక కథ ఇది.. ఒక మహిళను అతి కిరతకంగా చంపిన హంతకుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్నది ఈ మూవీ స్టోరీ. ఆ సినిమానే పలాయం పీసీ.. ఈ మూవీ రిలీజ్ అయిన చాలా రోజులకు ఓటీటీలోకి రాబోతుంది. ఆ మూవీ ఏ ఓటీటీలో రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ రెండు కోట్లు రాబట్టింది.. రాహుల్ మాధవ్‌, కొట్టయం రమేష్, జాఫర్ ఇడుక్కి కీలక పాత్రలు పోషించారు.. ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయిన పదకొండు నెలల తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమా కథ ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. చంద్రన్ నాయర్ అనే వ్యక్తి పలాయం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. రిస్క్ ఉండదనే ఆలోచన తో ఎక్కువగా నైట్ డ్యూటీలోనే ఉంటాడు. సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన ఓ మహిళా సంఘ సంస్కర్త ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఆమె చేస్తున్న పోరాటాలకు ఆమె అడ్డు తొలగించుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఆమెను కాపాడటానికి ప్రభుత్వం పోలీసులను ఆశ్రయస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెను కాపాడే బాధ్యతను చంద్ర నాయర్ కు అప్పగిస్తారు. అతను డ్యూటీలో ఉండగానే ఆమెను ఎవరో దుండగులు చంపేస్తారు.


అయితే ఆమె మరణం అంతు చిక్కని మిస్టరీగానే ఉండిపోతుంది. ఇంతకీ ఎవరు చంపారు అన్నది తెలియలేదు. అసలైన హంతకుడిని చంద్రన్ ఎలా పట్టుకున్నాడు? చంద్రన్ ప్రతిభకు మెడల్ దక్కిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.. ఈ మూవీలో పాటలు, కామెడీ సన్నివేశాలు ఏవి లేవు. సీరియస్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు అనిల్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాన్సెప్ట్‌తో పాటు కథలోని ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. స్టార్స్ ఎవరూ ఈ సినిమాలో లేరు. క్యారెక్టర్ ఆర్టిస్టులతో ప్రయోగాత్మకంగా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఆ సినిమాకు అనుకోని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది.. థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..  ఇక సీనియర్ నటుడుగా రాహుల్ మాధవన్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్‌, పురింజు మరియం జోస్‌, కడువా, హంట్‌తో పాటు వందకుపైగా సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా నటించాడు.. తెలుగులో కూడా ఇక ముందు బిజీ అవ్వబోతున్నాడు.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×