Razer Hammerhead V3 Chroma: టెక్నాలజీ ఎంత మారుతున్నప్పటికీ.. జీరో లాటెన్సీ , నిరంతర ఆడియో ఫీల్ కోరుకునే హార్డ్‌కోర్ గేమర్స్, ఆడియోఫైల్స్ ఇప్పటికీ వైర్డ్ ఇయర్ ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో.. ఉంచుకుని గేమింగ్ యాక్సెసరీల దిగ్గజం ‘రేజర్’ తన సరికొత్త ‘హ్యామర్‌హెడ్ V3 క్రోమా’ వైర్డ్ ఇయర్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. స్టైలిష్ లుక్, ప్రీమియం సౌండ్ క్వాలిటీ, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ ఇయర్ ఫోన్స్ ప్రత్యేకతలు,ధరల పూర్తి వివరాలు ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా ఇప్పుడు తెలుసుకుందాం!
రేజర్ బ్రాండ్ అనగానే ముందుగా ..గుర్తుకు వచ్చేది దాని సిగ్నేచర్ ఆర్జీబీ లైటింగ్. ఈ హ్యామర్‌హెడ్ V3 క్రోమా ఇయర్ ఫోన్స్ ప్రత్యేకమైన రేజర్ క్రోమా ఆర్జీబీ లైటింగ్‌తో వస్తాయి. దీనిని యూజర్లు తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక డిజైన్ విషయానికి వస్తే.. చెవులకు ఎంతో కంఫర్టబుల్‌గా ఉండేలా ఎర్గోనామిక్ డిజైన్‌ను అందించారు. ఎంత సేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
సాధారణంగా వైర్డ్ ఇయర్‌ఫోన్లలో.. ఏఎన్‌సీ ఫీచర్ చూడటం చాలా అరుదు. కానీ రేజర్ ఈ మోడల్‌లో.. ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్‌ను వాడి గేమర్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. చుట్టు పక్కల ఉండే అనవసరమైన సౌండ్స్ ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీని వల్ల ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బిజీ వాతావరణంలో.. కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా గేమ్స్ ఆడొచ్చు. లేదా మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.
దీనిలోని కస్టమ్-ట్యూన్డ్ డ్రైవర్స్ అద్భుతమైన బేస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్‌ను అందిస్తాయి. ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్స్ ఆడేటప్పుడు శత్రువుల అడుగుల చప్పుడును కూడా.. స్పష్టంగా గుర్తించడానికి ఈ ఆడియో అవుట్‌పుట్ ఎంతగానో సహాయ పడుతుంది. అలాగే మ్యూజిక్ లవర్స్ కు ఇది ఒక మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు లేదా బయట జాగింగ్ చేసేటప్పుడు.. చెమట పట్టినా,లేదా అకస్మాత్తుగా చిన్నపాటి వర్షం కురిసినా.. ఈ ఇయర్ ఫోన్స్‌కి ఎలాంటి హాని జరగకుండా IPX4 స్ప్లాష్-ప్రూఫ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వీటి క్వాలిటీ మరింత పెరుగుతుంది.
Also Read: కొత్తవి కొనకండి! పాడైపోయిన బల్బులను ఇలా క్షణాల్లోనే రిపేర్ చేయండి!
ఇది యూఎస్ బీ టైప్-సి కనెక్షన్‌తో వస్తుంది.లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లకు ఇది చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇన్-లైన్ మైక్రోఫోన్ ఉండటం.. వల్ల కాల్స్ మాట్లాడటం కూడా చాలా ఈజీ. ఇక ధర విషయానికి వస్తే.. గ్లోబల్ మార్కెట్లో దీని ధర దాదాపు రూ. 5,800 నుంచి రూ.6,000) వరకు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే.. ఇది అధికారికంగా మార్కెట్లోకి కూడా రానుంది.
వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌లో.. ఛార్జింగ్ టెన్షన్ , లాటెన్సీ సమస్యలతో విసిగిపోయిన వారికి ఈ ‘రేజర్ హ్యామర్‌హెడ్ V3 క్రోమా’ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం. పవర్‌ఫుల్ ఏఎన్‌సీ, స్టైలిష్ ఆర్జీబీ లైటింగ్ , రేజర్ నమ్మకంతో వస్తున్న ఈ ఇయర్‌ఫోన్స్ ఖచ్చితంగా గేమర్స్‌ను పర్ఫెక్ట్!