TWS earbuds buying guide: ప్రస్తుత డిజిటల్ ట్రెండ్‌లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు, జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు, ట్రావెలింగ్ సమయంలో ఇయర్ బడ్స్ లేనిదే రోజు గడవదు. అయితే .. మార్కెట్లో వందల రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటంతో .. చాలా మంది యూజర్లు కేవలం ఇయర్ బడ్స్ డిజైన్ , కలర్, బాక్స్ చెప్పే బ్యాటరీ లైఫ్ (40 గంటలు,50 గంటలు అంటూ) చూసి గుడ్డిగా కొనేస్తుంటారు. కానీ కొన్న తర్వాత అసలు సమస్యలు బయట పడతాయి. ఇయర్ బడ్స్ కొనేటప్పుడు మనం కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఆ కీలక అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం!
చాలా మంది ఇయర్ బడ్స్ చూడటానికి ..చాలా స్టైలిష్‌గా ఉన్నాయని కొనేస్తారు. కానీ చెవిలో .. పెట్టుకున్నప్పుడు సరిగ్గా ఫిట్ కాకపోతే.. కొద్ది సేపటికే చెవి నొప్పి వస్తుంది. రన్నింగ్ లేదా జాగింగ్ చేసేటప్పుడు.. కింద పడిపోతుంటాయి. కాబట్టి.. ఇయర్ బడ్స్ కొనేముందు అవి మీ చెవి ఆకారానికి సరిగ్గా సరిపోతాయా (ఇన్-ఇయర్ డిజైన్ లేదా స్టెమ్ డిజైన్) అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. సిలికాన్ ఇయర్ టిప్స్ సరిగ్గా.. లేక పోతే నాయిస్ ఐసోలేషన్ కూడా సరిగ్గా జరగదు.
బాక్స్ మీద 50 అవర్స్ బ్యాటరీ బ్యాకప్.. అని రాసి ఉందని వెంటనే కొనేయకండి. బ్యాటరీ ఎంత ఉన్నా, లోపల ఉండే ఆడియో డ్రైవర్ , AAC, SBC, లేదా aptX వంటి ఆడియో కోడెక్స్ సపోర్ట్ ఎలా ఉందనేది ముఖ్యం. ఇది లేకపోతే.. పాటలు వినేటప్పుడు.. క్లారిటీ ఉండదు, కేవలం హై-బేస్ మాత్రమే వచ్చి అసలు మ్యూజిక్ ఫీల్ పాడు చేస్తుంది.
Also Read: 75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది
మనం ఇయర్ బడ్స్‌ని.. కేవలం పాటలు వినడానికే కాకుండా ఫోన్ కాల్స్ మాట్లాడటానికి కూడా ఎక్కువగా వాడుతుంటాం. కానీ.. చాలా బడ్జెట్ ఇయర్ బడ్స్‌లో.. కాల్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపించదు. కాబట్టి మైక్ క్వాలిటీ, ఈఎన్సీ లేదా ఏఎన్‌సీ ఫీచర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది రివ్యూస్ చూసి నిర్ధారించుకోవాలి.
మీకు గేమింగ్ అలవాటు ఉంటే.. లేదా ఎక్కువ సినిమాలు చూసే అలవాటు ఉంటే ‘లో లాటెన్సీ’ఉన్న ఇయర్ బడ్స్‌ని ఎంచుకోవాలి. ఇది లేకపోతే.. వీడియోలో పెదాల కదలికకు, మనకు వినిపించే సౌండ్‌కి మధ్య తేడా (డిలే) వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3 లేదా అంతకంటే లేటెస్ట్ వెర్షన్ ఉంటే కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యే సమస్య ఉండదు.
ఇయర్ బడ్స్ కొనేటప్పుడు కేవలం దాని లుక్, అందమైన కలర్లు లేదా కేవలం బ్యాటరీ లైఫ్ చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు. మీ చెవికి సరిగ్గా. సరిపోయే ఫిట్, మంచి సౌండ్ క్లారిటీ, కంఫర్ట్ వంటి కీలకమైన అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. మీ డబ్బు వృథా కాదు, అంతే కాకుండా మీరు అద్భుతమైన ఆడియో ఫీల్ పొందొచ్చు!