E-Paper
Advertisement

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!
Advertisement

Shakeela Biopic Movie: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ సెలబ్రిటీల గురించి అలాగే పొలిటికల్ లీడర్స్, ఇక క్రీడారంగంలో ఉన్నవారికి సంబంధించిన బయోపిక్ సినిమాలను ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే తాజాగా మరో బయోపిక్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. బేబీ సినిమా(Baby Movie) ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి రాజేష్(Sai Rajesh) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా నటి షకీలా బయోపిక్ సినిమా(Shakeela Biopic Movie) గురించి సంచలన విషయాలు తెలియజేశారు.

షకీలా బయోపిక్ సినిమా..

షకీలా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి. ఈమె చేసిన పాత్రలు ఫోర్న్ తరహా పాత్రలు అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో షకీలా నటించిన సినిమాలు విడుదలవుతున్న కూడా స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేసుకునేవారు. ఇలా రోజుకు ఆరు షిఫ్ట్లలో సినిమాలు చేస్తూ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం చాలా దీన పరిస్థితులలో ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సాయి రాజేష్ ఈమె జీవిత కథను ఒక సినిమాగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు.

హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు..

Advertisement

కొబ్బరి మట్ట సినిమా సమయంలో షకీలా గారిని చాలా దగ్గర నుంచి గమనించానని ఒకానొక సమయంలో ఆరు షిఫ్ట్ లలో క్షణం తీరిక లేకుండా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూ గొప్ప జీవితాన్ని అనుభవించిన షకీలా ఇప్పుడు చెన్నైలో ఒక సింగిల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉంటున్నారని తెలిపారు. కొబ్బరిమట్ట సినిమా సమయంలో తాను షకీలా గారిని ఒక సాధారణ ఆర్టిస్టులాగా చూశానని ఆయన తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందిన నటిగా గుర్తింపు సంపాదించుకున్న షకీలా జీవితంలో వచ్చిన మార్పులు తనని బాగా ఆలోచింప చేసాయని, అందుకే ఆమె బయోపిక్ సినిమా చేయాలన్న ఆసక్తి కూడా పెరిగిందని తెలిపారు.

సెలబ్రిటీల జీవితాలు ఒకేలా ఉండవు..

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల జీవితాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవని సాయి రాజేష్ తెలిపారు. అందుకు షకీలా జీవితమే నిదర్శనం అని తెలిపారు. సాయి రాజేష్ షకీలా జీవితం కథ గురించి సినిమా చేయాలనే ఆసక్తిని ఉన్నట్టు ఈ సందర్భంగా బయటపెట్టారు కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను ఈయన వెల్లడించలేదు. మరి షకీలా బయోపిక్ సినిమా ఈయన అనుకున్న విధంగా తెరపైకి రావాలి అంటే మరి కాస్త సమయం పడుతుందని చెప్పాలి.

Advertisement

Also Read: ఘనంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదా వివాహం… ఫోటోలు వైరల్!

Related News

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

నటి అతుల్య చంద్ర ఫిర్యాదులో బయటపడ్డ సంచలన నిజాలు!

బాలయ్య రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారు.. కారణం ఇదే!

Big Stories

Advertisement
×